Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికీ అవే మ‌త్తుక‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది!

By:  Tupaki Desk   |   5 Aug 2022 6:42 AM GMT
ఇప్ప‌టికీ అవే మ‌త్తుక‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది!
X
చిరుత (2007) సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముంబై గాళ్ నేహా శ‌ర్మ యాటిట్యూడ్ ని ప‌ర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయడంలో పూరి వంద శాతం స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. స్వ‌త‌హాగానే గ‌ర్వంతో ఎదుటివారిపై అహంకారాన్ని ప్ర‌ద‌ర్శించే రిచ్ కిడ్ గా ఆ చిత్రంలో శ‌ర్మా గాళ్ న‌టిస్తే త‌న‌కు బాడీ గార్డ్ గా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు.

ఈ సినిమాలో పూరి మార్క్ పంచ్ డైలాగులు ఓ రేంజులో క్లిక్క‌య్యాయి. ఇక సముద్రంలో మ‌ర‌బోట్ ప్ర‌యాణంలో త‌న‌కు బాడీ గార్డ్ గా వ‌చ్చిన చెర్రీని ''హేయ్ బాబూ ఇటు రా!'' అని పొగ‌రుగా గ‌మ్మ‌త్తుగా పిలుస్తుంది నేహా. ఆ స‌మ‌యంలో శ‌ర్మా గాళ్ మ‌త్తు క‌ళ్ల‌లో కైపు కిక్కు యూత్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోదు.

ఆ పాత్ర‌కు ఆ యాటిట్యూడ్ సూటైంది. పూరి ఆలోచ‌న కూడా వ‌ర్క‌వుటైంది. కానీ నేహాశ‌ర్మ ఎందుక‌నో ఆ త‌ర్వాత టాలీవుడ్ లో ఏ ఒక్క సినిమా కూడా చేయ‌కుండా దూర‌మైంది. కానీ ఎట్ట‌కేల‌కు ఈ బ్యూటీ తిరిగి టాలీవుడ్ కి వ‌స్తోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంటోంది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో జోరుమీదున్న నేహా శ‌ర్మ త‌న మ‌న‌సు మార్చుకుని టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మవుతోంద‌ని తెలిసింది. జాన్వీ స‌హా యువ‌నాయిక‌లు టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆస‌క్తిగా ఉండ‌గా శ‌ర్మా గాళ్ కూడా త‌న ఆలోచ‌న‌లు మార్చుకుంద‌ని స‌మాచారం.

ఒక‌వేళ పూరీనే త‌న రీఎంట్రీకి స‌హ‌క‌రిస్తున్నారా లేక ఇంకేదైనా కొత్త ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఈ బ్యూటీని బ‌రిలో దించుతోందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. తాజాగా నేహా శ‌ర్మ షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో దుమ్ము రేపుతోంది. బ్లాక్ ఫ్రాక్ లో నేహా అందాలు క‌నువిందు చేస్తున్నాయి. ఇక చిరుతలో క‌నిపించిన‌ట్టే ఇప్ప‌టికీ అవే మ‌త్తుక‌ళ్ల‌తో చిత్తు చేస్తోంది.

చిరుత 2007లో రిలీజైంది. ఇప్ప‌టికే ప‌ద‌హారేళ్లు అయినా ఇంకా నేహా శ‌ర్మలో టింజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం న‌వాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తోంది. త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌తో క‌లిసి షైనింగ్ విత్ శ‌ర్మాస్ యూట్యూబ్ షోతోను దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే.