Begin typing your search above and press return to search.

నేహా నేహా అంటున్న ఇన్ స్టా ఫాలోవర్స్..!

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:45 AM GMT
నేహా నేహా అంటున్న ఇన్ స్టా ఫాలోవర్స్..!
X
గ్లామర్ షోలో గ్యాప్ ఇవ్వకుండా తన అందాలతో అదరగొట్టేస్తుంది చిరుత బ్యూటీ నేహా శర్మ. ఎప్పుడూ తన గ్లామర్ షో విషయంలో అసలు ఆడియన్స్ ని నిరుత్సాహ పరచదు అమ్మడు. నేహా శర్మ గ్లామర్ ట్రీట్ కి ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఎలాంటి కాస్టూం వేసినా సరే తను చూపించాలనుకుంటున్నది పర్ఫెక్ట్ గా ఎక్స్ పోజ్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మడి యద సంపదని చూపిస్తూ కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించేస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ నేహా ది కూడా సెపరేట్ స్టైల్. అందుకే ఆమె సినిమాల కన్నా సోషల్ మీడియా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది.

తెలుగులో మెగా వారసుడితో సినిమా చేసినా సరే అంతగా క్లిక్ అవలేదు. ఇక్కడ రెండు మూడు సినిమాలకే దుకాణం సర్ధేయగా బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి కొద్దిగా అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అవలేకపోయింది.

సినిమాలను నమ్ముకుంటే కష్టమని సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది నేహా శర్మ. స్పెషల్ ఏదైనా సరే నేహా ఇన్ స్టాగ్రాం ఓపెన్ చేస్తే చాలు అమ్మడి అందాల ప్రదర్శనతో ఫ్రీ షో అందుబాటులో ఉంటుంది. అందుకే ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ అంతా కూడా నేహా నేహా అని కలవరిస్తుంటారు. సినిమాలతో కన్నా ఇలా ఇన్ స్టా ఫోటోలతో ఆమె హాట్ డిస్కషన్స్ లో ఉంటుంది.

ఇన్ స్టాగ్రాంలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న నేహా శర్మ ప్రస్తుతం వారిని ఎంటర్టైన్ చేయడమే తన మెయిన్ టార్గెట్ అన్నట్టుగా తన గ్లామర్ ట్రీట్ తో అలరిస్తుంది. రోజుకొక కొత్త హాట్ అప్పీల్ తో తన ఫాలోవర్స్ ని ఏమాత్రం అసంతృప్తి పడనివ్వకుండా చేస్తుంది నేహా శర్మ.

మరి ఈ అమ్మడి అందాలను ఏ దర్శకుడు గుర్తించట్లేదా ఎందుకు ఇంత అందాన్ని అడివి కాచిన వెన్నెలలా వేస్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పటికీ సరైన ఛాన్స్ వస్తే చాలు ఎలాంటి పాత్రలో అయినా తన సత్తా చాటేస్తా అంటూ ఛాలెంజ్ చేస్తుంది నేహా శర్మ.

అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకి బాగానే మైలేజ్ తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న అమ్మడు మళ్లీ అవకాశం వస్తే సౌత్ సినిమాల్లో కూడా చేయాలని అనుకుంటుందట. తన ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండే నేహా శర్మ అప్పుడప్పుడు వారితో చిట్ చాట్ కూడా చేస్తుంది. కెరియర్ లో జోరు లేదు కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా నేహా శర్మ దూసుకెళ్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.