Begin typing your search above and press return to search.
డీజే టిల్లులో `పటాస్ పిల్ల` మెరుపులు
By: Tupaki Desk | 25 Jan 2022 3:00 PM GMTయువ నటుడు సిద్ధు కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం `టీజే టిల్లు`. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం పనుల్ని యూనిట్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తాజాగా ఈ సినిమాలోని పాటల్ పిల్ల అంటూ సాగే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. పాటలో నేహాశెట్టి లుక్..పెర్పార్మెన్స్..అందం ఆకట్టుకుంటోంది.
అనిరుధ్ ఆలపించిన ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. పాట ఆద్యంతం శ్రోతల్ని ఆకట్టుకుంటుంది. ఈ పాటకి కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా..శ్రీచరణ్ పాకాల స్వరపరిచారు. ఇంకా సినిమాలో మరిన్ని పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇది చక్కని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. క్యాచీ టైటిల్ తో సినిమా ప్రేక్షకుల్లో నలుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయితే ప్రచార చిత్రాలకు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ఇందులో ప్రిన్స్ సిసిల్ ..బ్రహ్మాజీ...ప్రగతి..నర్రా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. విమల్ కృష్ణ- సిద్దు రచన దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగ్ చాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ధీరజ్ మెగిలినేని ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు.