Begin typing your search above and press return to search.

పుష్ప స‌ర‌స‌న టిల్లుగాని ల‌వ‌రు..!

By:  Tupaki Desk   |   29 March 2022 3:30 AM GMT
పుష్ప స‌ర‌స‌న టిల్లుగాని ల‌వ‌రు..!
X
పుష్ప‌రాజ్ గా మాస్ యూత్ ని షేక్ చేశాడు అల్లు అర్జున్. అలాంటి క్రేజీ స్టార్ స‌ర‌స‌న ఒక కొత్త‌మ్మాయికి అవ‌కాశం వ‌స్తోంది అంటే సాటి నాయిక‌లు కుళ్లుకోవడం ఖాయం. పుష్ప లాంటి మాసీ యువ‌కుడితో ర‌ష్మిక రొమాన్స్ చూశాక అలాంటి ఛాన్స్ త‌మ‌కు ద‌క్క‌నందుకు చాలామంది అగ్ర నాయిక‌లే కుళ్లుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు అందుకు ధీటుగా మ‌రో కొత్త‌మ్మాయ్ ఏకంగా బ‌న్ని స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇది పూర్తి నిడివి సినిమాకి కాదు కానీ ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న కోసం అని తెలిసింది. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ అంటే డీజే టిల్లు ల‌వ‌ర్ నేహాశెట్టి. న‌వ‌త‌రంలో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతోంది ఈ అమ్మ‌డు. ఇటీవ‌లే డీజే టిల్లుతో బంప‌ర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

తాజా సమాచారం మేర‌కు.. అల్లు అర్జున్ - నేహా నటించిన జొమాటో ప్ర‌క‌ట‌న‌ టెలివిజన్ లో విడుదలైంది. ఇద్దరు నటీనటులు సినిమా షూటింగ్ లో ఉన్నట్లు ప్రకటనలో చూపించారు. అల్లు అర్జున్ హీరో ఎంట్రీ సీన్ కోసం స్లో మోషన్ ని పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నేహా త్వరగా చేయమని అభ్యర్థిస్తుంది. కారణం త‌న‌కు ఎంతో ఆకలిగా ఉంది.

త్వ‌ర‌గా పిజ్జా తినాలనుకుంటోంది. కూల్ అండ్ క్యాజువల్ అయిన అల్లు అర్జున్ ఆమెకు ఇష్టమైన ఫుడ్ ని జొమాటోలో ఆర్డర్ చేయమని సూచించాడు. అది అంత‌లోనే డెలివరీ అవుతుంది. నేహా తనకు ఇష్టమైన వంటకాన్ని ఆనందంతో రుచిచూస్తుండ‌గా ప్రకటన ముగుస్తుంది. ఓవ‌రాల్ గా అంత క్రియేటివ్ గా లేక‌పోయినా నేహా శెట్టి ప్ర‌క‌ట‌న‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

టిల్లుగాని ల‌వ‌ర్ గా అద‌ర‌గొట్టేసిన నేహాశెట్టికి ఇప్పుడు పెద్ద ఆఫర్ లు ఉన్నాయి. పెద్ద స్టార్ల స‌ర‌స‌నా ఛాన్సులు ద‌క్క‌నున్నాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. అనేక ప్రాజెక్ట్‌ల కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే నేహా తన మార్గంలో వచ్చే ఏ సినిమాలకైనా సైన్ చేయడానికి తొందరపడటం లేదు. ఆమె తన సినిమాలు పాత్రల విష‌యంలో సెల‌క్టివ్ గా ఉంటోంది. నేహా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఆమె లుక్స్ .. పెర్ఫార్మెన్స్ ప‌రంగా అంతగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత తనని తాను మెరుగుపరుచుకుంటోంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇదీ కుర్ర బ్యూటీ స్వ‌గ‌తం..

పూరి జగన్నాధ్ తెర‌కెక్కించిన‌ మెహబూబా తో తెర‌కు ప‌రిచ‌య‌మైన నేహా శెట్టి సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీలోనూ నాయిక‌గా నటించింది. కానీ ఏవీ క‌లిసి రాలేదు. సిద్ధూ ప్రధాన పాత్రలో నటించిన డి జె టిల్లు నేహా శెట్టికి తొలి బంప‌ర్ హిట్. ఈ మూవీతో అమ్మ‌డు భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ముఖ్యంగా యువ‌త‌రం హృద‌యాల్ని దోచేసింది ఈ బ్యూటీ.