Begin typing your search above and press return to search.

ఇంత‌లోనే ఇలా పెంచేస్తే ఎలా అమ్మ‌డూ?

By:  Tupaki Desk   |   19 Feb 2022 3:30 AM GMT
ఇంత‌లోనే ఇలా పెంచేస్తే ఎలా అమ్మ‌డూ?
X
చ‌క్క‌నమ్మ‌లు ఇట్టే చెట్టెక్కి కూచుకుంటున్నారు. పారితోషికంలో అస్స‌లు దిగేదే లేద‌ని సెలవిస్తుంటే నిర్మాత‌లు షాక్ తింటున్నారు. ఇంత‌కుముందు రీతూ వ‌ర్మ‌.. షాలిని పాండే .. ర‌ష్మిక మంద‌న విష‌యంలో ఇలానే జ‌రిగింది. స‌ద‌రు భామ‌లు ఒక్క హిట్టుతోనే పారితోషికాలు పెంచేసి నిర్మాత‌ల‌కు జ్వ‌రం ర‌ప్పించారు. కార‌ణం ఏదైనా కానీ వాళ్ల‌ను ఇండ‌స్ట్రీ ప‌క్క‌న పెట్టేసింది.

ఇక‌పోతే ఇటీవ‌ల హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా శ్రీలీల.. డింపుల్ హయాతి.. మీనాక్షి చౌద‌రి లాంటి భామ‌లు కూడా పెద్ద‌గానే డిమాండ్ చేస్తున్నార‌ని గుసగుస ఉంది. అయితే త‌మ రేంజుకు త‌గ్గ‌ట్టు డిమాండ్ చేయ‌కుండా శ్రుతిమించితే చెల్లించేందుకు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కం.

కొన్నేళ్ల‌ క్రితం పూరి జగన్నాథ్ వార‌సుడు ఆకాష్ తొలి చిత్రం మెహబూబాతో రంగప్రవేశం చేసిన కన్నడ బ్యూటీ నేహా శెట్టి తెలుగు పరిశ్రమలో మ‌రో ఛాన్స్ కోసం చాలా సమయాన్ని వెచ్చించింది. ప్రస్తుతం DJ టిల్లు చిత్రంలో తన హాట్ లుక్స్ తో కుర్ర‌కారు నుంచి ప్రశంసలు అందుకుంటుంది. న‌టిగా ఏమంత చెప్పుకోద‌గ్గ విష‌యం ఏదీ లేదు.

కానీ త‌న‌ గ్లామరస్ అప్పియరెన్స్ లిప్ లాక్ ల‌తో బీసీ కేంద్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. బ‌హుశా ఇదే ఇప్పుడు త‌న‌కు అవ‌కాశాల్ని తెచ్చి పెడుతుంద‌ని టాక్. ఇటీవ‌ల ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌కు ఆఫ‌ర్లు ఇచ్చార‌ట‌. అయితే పారితోషికంలో కొండెక్కి కూచోవ‌డంతో పున‌రాలోచిస్తున్నార‌నేది గుస‌గుస‌.

ఒక పెద్ద హీరోతో పెద్ద‌ బ్లాక్ బస్టర్ వచ్చే వరకు ఆమె వేచి ఉండాల్సింది. కానీ ఇంత‌లోనే ఇలా పెంచేస్తే ఎలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. అయితే హిట్టును న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికైనా హిట్టు అవ‌కాశాలు తెస్తుంది. అదే కేట‌గిరీలో ఇప్పుడు నేహా శెట్టి అవ‌కాశాలు అందుకుంటోంది. వాటిని స‌ద్వినియోగం చేసుకుని న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.