Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌ : క్యూటీ డీజే రాధిక మెస్మరైజింగ్‌ స్మైల్‌

By:  Tupaki Desk   |   11 April 2022 2:30 AM GMT
ఫోటో టాక్‌ : క్యూటీ డీజే రాధిక మెస్మరైజింగ్‌ స్మైల్‌
X
మెహబూబా మరియు గల్లీ రౌడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు ఆ సినిమాలతో దక్కించుకోలేని సక్సెస్ ను ఇటీవల విడుదల అయిన డీజే టిల్లుతో దక్కించుకుంది. ట్రెండీ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నేహా శెట్టికి మంచి గుర్తింపు దక్కింది.

ఇప్పుడు టాలీవుడ్‌ లో నేహా శెట్టి మోస్ట్‌ వాంటెడ్ అండ్ క్రేజీ బ్యూటీ అనడంలో సందేహం లేదు. డీజే టిల్లు సినిమా లో రాధిక పాత్రలో నటించి మెప్పించిన నేహా శెట్టికి ఇప్పుడు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు వస్తున్నాయట. రాధిక పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన నేహా శెట్టి ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలను షేర్‌ చేస్తూ తన అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు కన్నుల విందు చేసే ఈ అమ్మడు తాజాగా ఫెస్టివల్‌ మూడ్‌ తో చాలా పద్దతైన ఈ ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. చుడి దార్ లో ఉన్న ఈ అమ్మడిని చూసి ప్రతి ఒక్కరు కూడా క్యూట్‌ రాధిక అంటూ కామెంట్స్ చేస్తూ ఆమె పై తమ అభిమానం ను చూపిస్తున్నారు.

డీజే టిల్లు సినిమాలో ఈమె కాస్త నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం తో నటిగా మరింత గుర్తింపు ను దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. డీజే టిల్లు పార్ట్‌ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలో కూడా రాధిక పాత్రలో ఈమె కనిపించే అవకాశాలు ఉన్నాయి. మెల్ల మెల్లగా ఆఫర్లకు ఓకే చెబుతున్న ఈ అమ్మడు త్వరలోనే ఒక పెద్ద హీరోతో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.