Begin typing your search above and press return to search.

టిల్లు గాని ల‌వ‌రు కిరాక్ ఫోజ్ ఇదిగో

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
టిల్లు గాని ల‌వ‌రు కిరాక్ ఫోజ్ ఇదిగో
X
అందానికి అందం ఎన‌ర్జీతో ఆక‌ర్షిస్తోంది నేహా శెట్టి. ఒకే ఒక్క హిట్టు కొట్టి మాంచి ఊపు మీద ఉంది ఈ బ్యూటీ. ఇక ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లోనూ అంతే జోరు చూపిస్తోంది. తాజాగా నేహా శ‌ర్మ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. అలా కాఫీ క‌ప్ తో అదిరే భంగిమ‌తో మ‌తులు చెడ‌గొడుతోంది ఈ కిల్ల‌ర్ బ్యూటీ.

నేహా శెట్టి డీజే టిల్లు తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. న‌టిగా తొలి మూవీ కంటే ఈ మూవీకే ఎక్కువ మార్కులు వేసారు జ‌నం. కన్నడ అమ్మాయికి ఇప్పుడు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. నేహా శెట్టి మరో తెలుగు చిత్రానికి సంతకం చేసింది. కార్తికేయ గుమ్మకొండ 9వ చిత్రంలో ఆమె జోడీ కట్టింది. లౌక్య ఎంటర్ టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాత‌గా ఈ చిత్రం ఇటీవ‌లే లాంఛనంగా ప్రారంభమైంది. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది క్రేజీ ప్రాజెక్ట్ ... కెరీర్ లో ఎన్నడూ లేని కాన్సెప్ట్ తో చాలా ప్రత్యేకమైన చిత్రంగా నిల‌వ‌నుంది.. అని మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ కార్తికేయ ట్వీట్ చేశాడు.

ఇది బూటకపు కథల చుట్టూ తిరిగే థ్రిల్లర్ అని మేకర్స్ చెబుతున్నారు. కార్తికేయకు ఇప్పటి వరకు ఇది భిన్నమైన చిత్రం. కథ చాలా ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ తిరుగుతోంది. స్థానిక గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం నవ్వించే కామెడీ డ్రామా సెటప్ ఉంటుంది అని నిర్మాత చెప్పారు. ఇలాంటి విభిన్న‌మైన‌ క‌థ‌లో న‌టిస్తున్నందుకు నేహా శెట్టి ఉబ్బిత‌బ్బిబ్బ‌తోంది. త‌న‌కు న‌టించేందుకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింద‌ని చెబుతోంది.