Begin typing your search above and press return to search.
చందమామపై తొలి మనిషి కథ..
By: Tupaki Desk | 30 Aug 2018 4:22 AM GMTచందమామపై అడుగుపెట్టిన తొలి మానవుడి జీవితకథను సినిమాగా తీస్తే.. చూసి తీరాలన్న ఎగ్జయిట్‌మెంట్ సహజమే కదా! ఆ మిషన్ పూర్తయి దశాబ్ధాల కాలం అయినా ఇప్పటికీ అదో మిస్టరీ మిషన్. భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన మిషన్ ఇదే. అయితే దానిని విజయవంతంగా పూర్తి చేసి మానవుడి మేధోశక్తికి ఎదురే లేదని నిరూపించారు ది గ్రేట్ సైంటిస్ట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అందుకే అతడిపై ప్రస్తుతం హాలీవుడ్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పాత్రలో ర్యాన్ గోస్లింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత డామీన్ ఛాజెల్లె దర్శకత్వం వహిస్తున్నారు. `ఫస్ట్ మ్యాన్` అనేది సినిమా టైటిల్. ఇదివరకూ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ బరిలోకి వచ్చింది. అక్టోబర్ 12న `ఫస్ట్‌మ్యాన్` ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ప్రఖ్యాత గార్డియన్ డాట్ కాం కథనం ప్రకారం... నాడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టడానికి ముందు అసలు భూమ్మీద ఎలాంటి ప్రయోగం జరిగింది? ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబంలో ఎమోషన్ ఏంటి? 1960లో నాటి సైంటిస్టులు ఈ ప్రయోగానికి ఎలా ప్రిపేరయ్యారు? లాంటి ఎన్నో ఉద్విగ్నమైన విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు.. అని తెలుస్తోంది. చంద్రుడిపై అడుగుపెట్టడం అంటే అది సాఫీగానే సాగిందా? లేక ఏవైనా అవాంతరాలు ఎదురయ్యాయా? ఆక్సిజన్ అందని చోట, మనిషి గ్రావిటీలోకి అడుగుపెట్టే చోట ఏదైనా విపత్తు సంభవించిందా? లాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై పాదం మోపినప్పుడు అక్కడ ధూళి ఎలా పైకి లేచింది? అటుపై అతడిలో ఎమోషన్ ఏంటి? అన్నది తెరపై అద్భుతమైన షాట్‌లో దర్శకుడు చూపిస్తున్నారట.
జేమ్స్ ఆర్.హాన్‌సెన్ బయోగ్రఫీ ఆధారంగా జోష్ సింగర్ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే రాశారని గార్డియన్ పేర్కొంది. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్లడం, విజయవంతంగా వెళ్లిన పని పూర్తి చేసుకోవడం అన్నది అనితర సాధ్యమైన ప్రక్రియ. దీనిని ఎంతో ఉద్విగ్నభరితంగా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఆసక్తికరంగా .. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యక్తిగత జీవితం ఎంతో కలతలతో కూడుకున్నది. అతడి భార్య సుదీర్ఘ వ్యాధిగ్రస్తురాలు. కుమార్తె మూడేళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించింది. ఈ విషయాల్ని ఎంతో ఉద్విగ్నంగా ఈ చిత్రంలో చూపించారుట. ఇదివరకూ గ్రావిటీ, స్పేస్ ఒడిస్సీ లాంటి స్పేస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాయి. అందుకే `ఫస్ట్ మ్యాన్` చిత్రంపైనా అంతే భారీ అంచనాలేర్పడ్డాయి.