Begin typing your search above and press return to search.
నెల్లూరు కుర్రాళ్ల ఫైట్లుః బడ్జెట్ ఇంత.. షూటింగ్ టైమ్ అంత..!
By: Tupaki Desk | 18 Jun 2021 2:30 AM GMTటాలెంట్ ఎన్నో రూపాల్లో ఉంటుంది.. అది ప్రపంచానికి చాటడానికి మాత్రం ఓ వేదిక కావాలి. డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత సోషల్ మీడియా, యూట్యూబ్ వంటివి మాధ్యమాలతో.. కావాల్సిన ప్లాట్ ఫాం దొరికేసింది. దీంతో.. చాలా మంది తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు నెల్లూరు కుర్రాళ్లు.
'రమణా లోడ్ ఎత్తాలిరా' అంటూ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో కంపోజ్ చేసిన ఫైట్ ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఇదే ఫైట్ ను స్పూఫ్ చేసిన నెల్లూరు కుర్రాళ్లు అదరగొట్టారు. వీరు కంపోజ్ చేసిన ఈ ఫైట్ వీడియోను.. సుమారు 70 లక్షల మందికిపైగా చూశారు.
ఈ మధ్యనే 'వకీల్ సాబ్' చిత్రంలోని ఫైట్ ను దించారు. ముగ్గురు అమ్మాయిలను రక్షించేందుకు మెట్రోలో పవన్ చేసిన ఫైట్ ను.. వీళ్లు లొకేషన్ షిఫ్ట్ చేసి దంచేశారు. ఒరిజినల్ కు ఏ మాత్రం తగ్గకుండా వీరు రూపొందిస్తున్న స్టంట్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ టీమ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది.
తాజాగా ఈ కర్రాళ్లు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ షూట్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమ వీడియోలకు వస్తున్న పాపులారిటీ తమలో కాన్ఫిడెన్స్ పెంచిందని, అందుకే కొత్త కొత్త స్టంట్స్ షూట్ చేస్తున్నట్టు చెప్పారు. అయితే.. తమకున్న అవకాశాలు, పరిధిలోనే ఈ ఫైట్లు షూట్ చేస్తున్నట్టు చెప్పారు.
ఇదంతా కేవలం స్మార్ట్ ఫోన్ తోనే షూట్ చేస్తున్నట్టు చెప్పడం విశేషం. ఇక, ఈ టీమ్ ఒక ఫైట్ ను కేవలం రెండు రోజుల్లోనే కంప్లీట్ చేస్తోందట. అంతకు మించిన సమయం పట్టట్లేదని చెప్పారు. ఇక, బడ్జెట్ విషయానికి వస్తే.. ఇందులో ఉండేది అందరూ పిల్లలే కాబట్టి.. వారికి కావాల్సినంత భోజనం సమకూరుస్తామని తెలిపారు. ఇంకా ఏవైనా వస్తువులు అవసరమైతే.. రెంట్ కు తెస్తామని చెప్పారు. ఈ మొత్తానికి సుమారు 15 వేల రూపాయల ఖర్చు వస్తోందని తెలిపారు. ఈ విధంగా తక్కువ బడ్జెట్ తో, తక్కువ టైమ్ లో అద్భుతమైన ఫైట్లను తెరకెక్కిస్తూ ఔరా అనిపిస్తున్నారు నెళ్లూరు కుర్రాళ్లు.