Begin typing your search above and press return to search.

తేజ సినిమా నాలుగు భాషల్లో..

By:  Tupaki Desk   |   28 May 2017 10:12 AM GMT
తేజ సినిమా నాలుగు భాషల్లో..
X
డైరెక్టర్ తేజ హిట్టు కొట్టి పుష్కరం దాటింది. ‘జయం’ తర్వాత ఆయన తీసిన సినిమా ఏదీ ఆడలేదు. ప్రతిసారీ తేజ చాలా కసిగా కనిపిస్తాడు. తాను తీసిన సినిమా గురించి గొప్పగా చెబుతాడు. ఈసారి హిట్టు పక్కా అన్న ధీమా వ్యక్తం చేస్తాడు. కానీ ఫలితం చూస్తే తేడాగా ఉంటుంది. చివరగా తేజ నుంచి వచ్చిన ‘హోరాహోరీ’ పెద్ద డిజాస్టర్ అయింది. అలాంటి సినిమా తర్వాత ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన రానా దగ్గుబాటి హీరోగా సినిమా చేసే అవకాశాన్ని తేజ దక్కించుకోవడం.. పైగా ఆ చిత్రాన్ని రానా తండ్రి సురేష్ బాబు స్వయంగా నిర్మించడం.. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాకు ఓకే చెప్పడం ఆశ్చర్యమే. తేజకు ఇలా కలిసొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.

తేజ కొత్త సినిమాకు సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ అని ప్రచారంలో ఉన్న టైటిల్‌ ను అధికారికంగా ప్రకటిస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు తేజ. బాహుబలి.. ఘాజీ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా రానాకు మార్కెట్ పెరిగిన నేపథ్యంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను తెలుగుతో పాటు తమిళం.. హిందీ.. మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు తేజ తెలిపాడు. ఇక ఈ సినిమా కథ గురించి తేజ వివరిస్తూ.. ప్రస్తుతం సమాజం ఏం జరిగినా పట్టదన్నట్లు జనాలు ఉంటున్నారని.. అలా ఒకడు తన చుట్టూ జరిగే విషయాల నుంచి పట్టించుకుంటే ఎలా ఉంటుందో అదే ఈ కథ అని చెప్పాడు తేజ. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. త్వరలోనే విడుదలవుతుందని తేజ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/