Begin typing your search above and press return to search.

‘నేను లోకల్’లో మనం చూడని సీన్స్

By:  Tupaki Desk   |   14 Feb 2017 6:10 AM GMT
‘నేను లోకల్’లో మనం చూడని సీన్స్
X
ఒకప్పట్లా మినిమం రెండున్నర గంటల నిడివితో సినిమాలు తీసే రోజులు పోయాయి. సాధ్యమైనంత వరకు రెండుంబావు గంటలు.. అంత కంటే తక్కువ నిడివి ఉండేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఒక వేళ నిడివి కాస్త ఎక్కువైనా.. నిర్మొహమాటంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెర వేసేస్తున్నారు. ఐతే సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. డెలీటెడ్ సీన్స్ ను సినిమాకు చేర్చడమో.. లేదంటే యూట్యూబ్ లో రిలీజ్ చేయడమో చేస్తున్నారు. గత ఏడాది ‘నేను శైలజ’ నుంచి ఎడిట్ అయిపోయిన కొన్ని సన్నివేశాల్ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘నేను లోకల్’ ఫైనల్ కట్ నుంచి తీసి పడేసిన సన్నివేశాల్ని నిర్మాత దిల్ రాజు యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు.

‘నేను లోకల్’ సినిమాలో ‘నెక్స్ట్ ఏంటి’ అనే పాట ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ పాట రావడానికి ముందు కొన్ని ఫన్నీ సీన్స్ సెట్ చేశారు. ఎడిటింగ్ లో అవి లేచిపోయాయి. ఇంటి నుంచి బయటపడ్డ నానిని పక్కింటి ఆంటీ నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది. అతనేమో సుసైడ్ చేసుకుని నీ పేరు రాసిపెడదామనుకుంటున్నా అంటాడు. మరో సీన్లో తన తండ్రికి తెలిసి పెద్దాయన పలకరించి నెక్స్ట్ ఏంటి అని అడిగితే.. మీ అమ్మాయితో కలిసి రేపు అన్నవరంలో అంటూ కంగారు పెట్టేస్తాడు. ఈ సన్నివేశాల్లో నాని తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు. ఈ సీన్స్ సినిమాలో ఉంటే బాగానే ఉండేది. ఆ సంగతలా ఉంచితే ‘నేను లోకల్’ రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లతో రూ.30 కోట్ల షేర్ మార్కు దిశగా దూసుకెళ్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/