Begin typing your search above and press return to search.

నాని రేంజ్ అంతలా పెరిగిపోయింది

By:  Tupaki Desk   |   29 Jan 2017 10:41 AM GMT
నాని రేంజ్ అంతలా పెరిగిపోయింది
X
అమెరికాలో వందకు పైగా స్క్రీన్లలో ఒక సినిమా రిలీజవ్వాలంటే ఆ హీరోకు ఒక రేంజ్ ఉండాలి. కొందరు స్టార్ హీరోలకు కూడా ఆ రేంజ్ లేదు. కానీ నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మాత్రం మినిమిం వంద థియేటర్లలో రిలీజ్ చేసి తీరాల్సిందే అన్నంత డిమాండ్ వచ్చేసింది. తొలిసారి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు అమెరికాలో వందకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఆ సినిమా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమగాథ.. జెంటిల్మన్.. మజ్ను సినిమాలు మూడూ 8 లక్షల డాలర్ల మార్కును అందుకుని.. నానిని అక్కడ మినిమం గ్యారెంటీ హీరోగా నిలబెట్టాయి.

ఇప్పుడు నాని కొత్త సినిమా ‘నేను లోకల్’ అమెరికాలో ఏకంగా 125 స్క్రీన్లలో రిలీజవుతోంది. బ్లూ స్కై సినిమాస్ ఈ చిత్రాన్ని అమెరికాలో రిలీజ్ చేస్తోంది. సంక్రాంతి సినిమాల సందడి తగ్గిపోయిన టైంలో మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది ‘నేను లోకల్’. 125 లొకేషన్లలోనూ ప్రిమియర్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా మినిమం హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం గ్యారెంటీ. టాక్ పాజిటివ్ గా వస్తే మిలియన్ మార్కును కూడా చేరుకునే అవకాశముంది. నాని-కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజవుతోంది. 2న అమెరికాలో ప్రిమియర్లు పడతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/