Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్స్.. బివేర్ ఆఫ్ నాని

By:  Tupaki Desk   |   17 Jan 2017 9:30 AM GMT
టాలీవుడ్ స్టార్స్.. బివేర్ ఆఫ్ నాని
X
చూస్తుండగానే ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతున్నాడు నాని. ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్స్ లో ‘నేచురల్ స్టార్’ అని నానికి బిరుదు తగిలిస్తే చాలామంది నవ్వుకున్నారు. అదేదో కామెడీగా ఇచ్చిన ట్యాగ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా అనూహ్యమైన విజయం సాధించి.. నానిని నిజంగానే స్టార్ ను చేసింది. దాని తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.. ‘జెంటిల్ మన్’.. ‘మజ్ను’ లాంటి సక్సెస్ లతో నాని రేంజే మారిపోయింది. ఇప్పుడు రాబోతున్న నాని కొత్త సినిమా ‘నేను లోకల్’ ట్రైలర్ చూస్తే నాని ఇంకాస్త గట్టిగానే కొట్టబోతున్నాడని అర్థమవుతోంది. నాని బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈసారి అందరికీ మరింత బాగా అర్థమవుతుందని అంచనా వేస్తున్నారు.

మామూలుగా పెద్ద హీరోల సినిమాలు వచ్చినపుడు మాత్రమే టీజర్లు.. ట్రైలర్లకు సంబంధించిన రికార్డుల చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ‘నేను లోకల్’ కూడా స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో వ్యూస్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే ‘నేను లోకల్’ ట్రైలర్ 1.5 మిలియన్ మార్కును అందుకోవడం విశేషం. పెద్ద హీరోల సినిమాల ట్రైలర్ల వ్యూస్ విషయంలో కొన్ని మానుపులేషన్స్ జరుగుతాయన్న మాట వాస్తవమే. అలాగే ఆయా హీరోల అభిమానులు పట్టుబట్టి వ్యూస్ పెంచే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ నాని సినిమా విషయంలో అలాంటివేమీ ఉండవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నానిని జనాలు జెన్యూన్ గా అభిమానిస్తారు. స్టార్ హీరోల తరహాలో అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉండరు కానీ.. అతణ్ని అభిమానించే వాళ్ల సంఖ్య చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఆ అభిమాన గణం అంతా ‘నేను లోకల్’ ట్రైలర్ ను చాలా ఆసక్తిగా చూసింది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లెవ్వరూ ఒక్కసారితో సరిపెట్టరు. ఇంకోసారి చూసేలా.. పక్కనవాళ్లకు కూడా చూపించేలా ఉంది ఆ ట్రైలర్. నాని రేంజి ఎలా పెరిగిపోతోందో చెప్పడానికి ‘నేను లోకల్’ ట్రైలర్ కు వచ్చిన ఆదరణే రుజువు. టాలీవుడ్ స్టార్ హీరోలు నానిని చూసి కొంచెం జాగ్రత్త పడాల్సిందే అనిపిస్తోంది అతడి జోరు చూస్తుంటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/