Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ కింగ్ రామ్
By: Tupaki Desk | 9 Jan 2016 11:30 AM GMTరెండు మూడేళ్లుగా ఓ మోస్తరు సినిమా కూడా లేక అల్లాడిపోతున్నాడు యువ కథానాయకుడు రామ్. అందులోనూ ‘శివమ్’ ఫలితం చూశాక తన కొత్త సినిమా ‘నేను శైలజ’ ఏవరేజ్ గా ఆడినా చాలనుకున్నాడు. కానీ ఈ సినిమా అతడు ఊహించిన దాని కంటే పెద్ద విజయమే సాధించింది. తొలి వారంలో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు నిర్మాత స్రవంతి రవికిషోర్ ను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో రూ.15 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిందీ సినిమా. నైజాంలో రూ.4 కోట్ల మార్కు అందుకుని రామ్ సినిమాల్లో ఇప్పటికే ఆ ఏరియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. యుఎస్ లో హాఫ్ మిలియన్ మార్కును దాటేసి.. రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది.
తెలుగులో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలం కావడం ‘నేను శైలజ’కు బాగా కలిసొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలు కూడా మెండుగా ఉండటంతో ఈ వర్గం ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తున్నారు. వీక్ డేస్ లో కూడా కలెక్షన్లకు ఢోకా లేదు. ఇక రెండో వీకెండ్లోనూ రామ్ బాక్సాఫీస్ ను ఏలుకున్నాడు. ఈ వారం వచ్చిన వర్మ సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’కు మంచి టాక్ వచ్చింది కానీ.. అది ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే సినిమా కావడంతో ‘నేను శైలజ’ కలెక్షన్ల మీద పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. ‘కిల్లింగ్ వీరప్పన్’తో పాటుగా రిలీజైన చిన్న సినిమాల్ని పట్టించుకునే నాథుడు లేడు. దీంతో సెకండ్ వీకెండ్ కూడా కలెక్షన్లు కుమ్ముకునేలా ఉంది ‘నేను శైలజ’. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు హవా ఈ సినిమాదే. రూ.20 కోట్లకు పైగా షేర్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.