Begin typing your search above and press return to search.
రామ్ సినిమాని ఒబామా చూడాల్సిందే
By: Tupaki Desk | 23 Dec 2015 11:30 AM GMTఎనర్జిటిక్ హీరో రామ్ - మళయాళీ బొద్దుగుమ్మ కీర్తి సురేష్ జంటగా నటించిన.. నేను.. శైలజ.. 2016 న్యూ ఇయర్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ మూవీలో పాటలకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్యూట్ లవ్ స్టోరీకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్ అంటూ ప్రశంసలు వస్తున్నాయి. అలాగే నేను.. శైలజ.. ట్రైలర్ కూడా అదే రోజు విడుదలైంది.
మొత్తం ఫన్ టానిక్ రేంజ్ లో కట్ చేసిన ఈ ట్రైలర్ లో.. హీరోయిన్ ఓ పజిల్ వదులుతుంది. "ఇది నువ్వనుకునేది కాదు.. "అని హీరోయిన్ అన్నపుడు. అంటే అని అడుగుతాడు రామ్. అపుడు "ఐలవ్యూ.. బట్ అయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ" అంటుంది కీర్తి సురేష్. దీంతో ఓ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు రామ్. ట్రైలర్ లో ఉన్న ఈ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ పజిల్ కి.. రీసెంట్ గా అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ కి ఎదురైన ఇన్సిడెంట్ తో లింక్ చేశారు నెటిజన్లు. రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనే అమెరికా నిర్ణయంతో.. చదువుకునేందుకు అమెరికా వెళ్లిన 19మంది విద్యార్ధులు నానా అగచాట్లు పడి ఇండియా చేరుకున్నారు. మరి ఆ యూనివర్సిటీలు బ్లాక్ లిస్ట్ లో ఉంచితే.. ఇక్కడి స్టూడెంట్స్ కు ఎఫ్1 వీసా ఎలా ఇచ్చారన్నది అసలు ప్రశ్న.
అంటే అమెరికా వాళ్లు వీసా ఇస్తారు కానీ.. అక్కడ అడుగు పెట్టేందుకు మాత్రం అనుమతించరన్న మాట. ఇది ఎగ్జాక్ట్ గా శైలజ ఇచ్చిన పజిల్ కి మ్యాచ్ అవుతోంది కదా. ఐ లవ్యూ చెప్పినా సరే.. నేను నీతో ప్రేమలో లేను అనడం.. వీసా ఇచ్చినా అమెరికాలో కాలు పెట్టద్దని చెప్పడంలాంటిదే అన్నమాట. ఇండియన్స్ స్టూడెంట్స్ ని ఇబ్బంది ఎందుకు పెట్టారో ఒబామా నోరు విప్పకపోవచ్చు కానీ.. శైలజ పజిల్ అయితే మాత్రం ఆన్సర్ దొరకుతుంది. అందుకే ఈ పంచ్ కి అసలు అర్ధం కావాలంటే.. నేను శైలజ మూవీని ఒబామా చూడాల్సిందే. అయినా ఓ సీరియస్ సమస్యను అందరికీ అర్ధమయ్యేలా ఇంత ఫన్నీగా చెప్పాలంటే సోషల్ సైట్లకే సాధ్యం.