Begin typing your search above and press return to search.
కంటెంట్ అదుర్స్.. అది కూడా కుదిరుంటే..!
By: Tupaki Desk | 4 Jun 2023 4:30 PM ISTబెల్లంకొండ గణేష్ హీరోగా లేటెస్ట్ గా రిలీజైన సినిమా నేను స్టూడెంట్ సర్. రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ అందించారు. సినిమా ఆడియన్స్ నుంచి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా సినిమాలో టచ్ చేసిన పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ లో పొరపాట్ల వల్ల సినిమా ఈ టాక్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సినిమాలో ప్రస్తావించిన అన్ క్లైండ్ కేసు ల గురించి మంచి కాన్సెప్ట్ తో సినిమా వచ్చింది. డైరెక్టర్ కూడా తన శక్తిమేరకు తన ప్రయత్నం తను చేసినా ఇంకాస్త బెటర్ గా తీసి ఉంటే బాగుండేది అనిపించింది.
ఇక సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ గణేష్ కూడా సెకండ్ సినిమాకు చాలా డెవలప్ మెంట్ కనిపించింది. స్వాతిముత్యం సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ లాంటి కథ సెలెక్ట్ చేసుకుని తన టేస్ట్ ఏంటన్నది చూపించాడు. నటన పరంగా మొదటి సినిమాతో పోలిస్తే ఇందులో బెటర్మెంట్ కనిపించింది. కంటెంట్ ఎంత బాగున్నా దాన్ని సరైన విధంగా తీయ లేకపోతే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. నేను స్టూడెంట్ సర్ విషయంలో అదే జరిగింది.
సినిమా చూసి ఆడియన్స్ అంతా కూడా మంచి పాయింట్ అనే చెప్పుకుంటున్నారు. ఇక బెల్లంకొండ గణేష్ ఇలాంటి కథ ఎంచుకోవడం పట్ల అతన్ని మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ కూడా తన ప్రయత్నం తను చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సినిమాను కేవలం 40 రోజుల్లో పూర్తి చేశారని తెలుస్తుంది. 3 కోట్ల బడ్జెట్ తో ఇంత అవుట్ పుట్ చూస్తుంటే దర్శకుడిగా రాఖీ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అయితే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే నేను స్టూడెంట్ సర్ సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని అంటున్నారు.
ఇక బెల్లంకొండ గణేష్ విషయానికి వస్తే అన్న భారీ కమర్షియల్ సినిమాలతో తన సత్తా చాటాలని ఫిక్స్ అయితే తమ్ముడు గణేష్ మాత్రం కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తున్నాడు. మొదటి సినిమా స్వాతిముత్యం తోనే అతను స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో అర్థమైంది. తప్పకుండా బెల్లంకొండ గణేష్ ఇలా డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ ఉంటే తనకు సక్సెస్ వచ్చి తీరుతుందని చెప్పొచ్చు.
బెల్లంకొండ హీరోలు ఇద్దరు సెపరేట్ పంథా కొనసాగిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తన మాస్ పంథాలో సినిమాలు చేస్తుంటే తమ్ముడు గణేష్ మాత్రం సెన్సిబుల్ స్టోరీస్, కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఫిక్స్ అయ్యాడు. నేను స్టూడెంట్ సర్ రిజల్ట్ ఎలా ఉన్నా బెల్లంకొండ గణేష్ అటెంప్ట్ ని మెచ్చుకోక తప్పదు.
ఇంకా ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ సతీష్ వర్మ గారు గురించి తప్పక మాట్లాడుకోవాలి ఆయన కూడా ఫస్ట్ నుంచి భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు . ఆయన ముందు తీసిన నాంది మూవీ కంటెంట్ పరంగా ఎంత మంచి పేరుతెచ్చుకొందో తెలిసిన విషయమే . ఇప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతోనే వచ్చారు . లిమిటెడ్ బడ్జెట్ లో మంచి సినిమాలు తీయవచ్చు అని ఆయన మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.