Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ల వ్యవహారంలో బుక్ మై షో, ఐనాక్స్ లకు షాక్

By:  Tupaki Desk   |   30 March 2022 7:35 AM GMT
సినిమా టికెట్ల వ్యవహారంలో బుక్ మై షో, ఐనాక్స్ లకు షాక్
X
ఈ మధ్య థియేటర్ కు వెళితే టికెట్లు ఏవీ దొరకడం లేదు. ఏమంటే ఆన్ లైన్ లోనే బుక్ అయిపోయాయని అంటున్నారు. అదే ఆన్ లైన్ ఓపెన్ చేస్తే టికెట్ తోపాటు ఆ ఫీజు, జీఎస్టీ సహా ఏదేదో సేవా రుసుం అంటూ మరో రూ.100 వరకూ ఎక్స్ ట్రా లాగేస్తున్నారు. దీంతో రూ.235 ఉన్న టికెట్ ధర 340కి చేరువ అవుతోంది. ఇలా ఆన్ లైన్ పేరిట జరుగుతున్న దోపిడీపై కడుపు మండిన ఓ ప్రేక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం టికెట్లను ఆన్ లైన్ లోనే అమ్ముతున్న సంస్థల గుట్టు రట్టు చేశారు. దీంతో ఆ సంస్థలకు పోలీసులకు షాక్ ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ప్రముఖ సినిమా టికెట్ల బుక్ కంపెనీలకు గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100శాతం ఆన్ లైన్ లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై ‘బుక్ మై షో’ పోర్టల్ తోపాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్ లపై సూపర్ బజార్ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనమైంది. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

2006లో ప్రభుత్వం జీవోనంబర్ 47 జారీ చేసింది. దీని ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టికెట్లను నేరుగా.. మిగిలిన సగం ఆన్ లైన్ లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్ లు 100 శాతం టికెట్లను ఆన్ లైన్ లోనే అమ్మున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అనంతరం కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిజానికి థియేటర్లలో సగం అమ్మి.. మిగతా సగం ఆన్ లైన్ లో అమ్మాలి. కానీ జనం థియేటర్లకు వచ్చి కొనడానికి బద్దికిస్తూ డబ్బులు ఎక్కువైనా ఆన్ లైన్ లోనే తమకు అనువైన సీట్లను ఎంచుకుంటున్నారు. దీంతో ఆన్ లైన్ లోనే సంస్తలు మొత్తం టికెట్లు అమ్ముతున్నాయి. అలా ప్రజలకు అలవాటు చేసి సాగుతున్న ఈ దోపిడీ దందా తాజాగా కేసుల వరకూ వెళ్లింది. దీనిపై ఏం తేలుతుందన్నది వేచిచూడాలి.