Begin typing your search above and press return to search.
నెట్ ఫ్లిక్స్ - ప్రైమ్ కౌంటర్ ట్వీట్స్.. ఇది పుష్ప రేంజ్
By: Tupaki Desk | 9 Jan 2022 5:32 AM GMTనెట్ ఫ్లిక్స్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆధరణ దక్కించుకున్న ఓటీటీ కాగా.. ఇండియాలో అత్యధిక ఆధరణ మరియు ఖాతాదారులు ఉన్న ఓటీటీ అమెజాన్ ప్రైమ్ అనడంలో సందేహం లేదు. ఈ రెండు ఓటీటీ లు ఇండియాలో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. బయట దేశాల్లో నెట్ ఫ్లిక్స్ కు అమెజాన్ గట్టి పోటీ అయితే ఇస్తుంది కాని ఇండియాలో మాత్రం అమెజాన్ తర్వాతే నెట్ ఫ్లిక్స్ అన్నట్లుగా మార్కెట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి పై మరొకరు పై చేయి సాధించేందుకు భారీ చిత్రాలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. వందల కోట్ల రూపాయలను పెట్టి హాలీవుడ్.. బాలీవుడ్ సినిమాలను కొనుగోలు చేస్తున్న ఈ రెండు ఓటీటీలు వెబ్ సిరీస్ ల విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో ఈ రెండు ఓటీటీ లకు పోటీ పడుతున్నాయి.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు గాను నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ లు సోషల్ మీడియాలో వారి వారి సినిమాలను ప్రమోట్ చేయడంతో పాటు ఆసక్తికర పోస్ట్ లు.. కరెంట్ అఫైర్స్ తో కూడిన విషయాలతో కలిపి తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. తాజాగా వీకెండ్ లో మీరు చూడబోతున్న సినిమా ఏంటీ అన్నట్లుగా ట్విట్టర్ లో నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు ట్వీట్ చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ కు అమెజాన్ ప్రైమ్ ఇండియా ట్విట్టర్ టీమ్ రెస్పాండ్ అయ్యి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పుష్ప సినిమాను చూసే పనిలో ఉన్నారు. కనుక ఇప్పుడు మీ సినిమాలు ఏమీ చూడక పోవచ్చు అన్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ ట్వీట్ వైరల్ అవ్వడంతో మళ్లీ నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ టీమ్ స్పందించారు. మరి మేము అందరిలో ఉన్నామా...? ఊ అనమ్ కాని ఊహూ అని కూడా అనము అన్నట్లుగా పుష్ప ఐటెం సాంగ్ ను తెలుగు లో నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ఈ రెండు దిగ్గజ ఓటీటీ లు కూడా ఇప్పుడు మన పుష్ప సినిమా గురించి ఇలా ట్వీట్స్ చేసుకోవడం చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏ రేంజ్ లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈమద్య కాలంలో ఏ సౌత్ సినిమా కు రాని క్రేజ్ ఉత్తరాదిన కేవలం పుష్పకు వచ్చింది అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమా హిందీ వర్షన్ 75 కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయినా కూడా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సినిమా స్క్రీనింగ్ జరుగుతుంది. ఉత్తరాదిన 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా మంచి వసూళ్లను అక్కడ రాబట్టడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పుష్ప గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఇది అసలైన పాన్ ఇండియా సినిమా.. ఇది పుష్ప రేంజ్ అంటూ బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.