Begin typing your search above and press return to search.
ఇండియన్స్ కు చేరువయ్యేందుకు నెట్ ఫ్లిక్స్ ప్రయత్నాలు
By: Tupaki Desk | 15 Dec 2021 1:30 AM GMTఇండియాలో ఓటీటీ బిజినెస్ అనూహ్యంగా పెరిగింది. కరోనాకు ముందు ఇండియాలో ఓటీటీ ల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఓటీటీ లో కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే చూసేవారు. థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని నెలల వారాల తర్వాత ఓటీటీ లో సినిమాలు విడుదల అయ్యేవి. అలాంటి ఓటీటీ లు ఇప్పుడు ఇండియన్ సినీ అభిమానులను ఊపేస్తున్నాయి. రెండేళ్ల పాటు థియేటర్లు పూర్తిగా క్లోజ్ ఉన్న కారణంగా ఓటీటీ ని ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రేక్షకులు ఎంచుకున్నారు. కరోనా సమయంలో పెద్ద సినిమా లు కూడా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ అవ్వడం వల్ల అనూహ్యంగా ఓటీటీ మార్కెట్ పెరిగింది. ఈ రెండేళ్ల సమయంలో ఓటీటీ మార్కెట్ భారీ ఎత్తున పెరిగినా కూడా ఇండియాలో నెట్ ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. అందుకు కారణం ఓటీటీ ల్లో అత్యంత ఖరీదైన ఓటీటీ నెట్ ఫ్లిక్స్ అనేది ఒక అభిప్రాయం పడి పోయింది.
వేల రూపాయలు సబ్ స్క్రిప్షన్ కు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇండియన్ ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ కు దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. నెట్ ఫ్లిక్స్ ను బాగా ఉన్నోళ్లు మాత్రమే కలిగి ఉంటారు అనే అభిప్రాయం ఉంది. అందుకే నెట్ ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య పెరగడం లేదు. నెట్ ఫ్లిక్స్ ఇండియన్ మార్కెట్ ను పెంచుకోవడం కోసం తమ రేట్లను పునరుద్దరించింది. రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు పలు ఆఫర్లను ప్రకటించింది. రూ.199గా ఉన్న బేసిక్ ప్లాన్ ధర రూ.50 తగ్గించింది. ఈ ప్లాన్ ధర రూ.149కి చేరింది. ఇక ప్రీమియం ప్లాన్ ధర రూ.799గా ఉండగా.. రూ.649కే ఇవ్వనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కొత్తగా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ కు కాస్త అటు ఇటుగా తమ రేటును నిర్ణయించిన నెట్ ఫ్లిక్స్ నార్త్ మరియు సౌత్ లో తమ కంటెంట్ స్పీడ్ ను కూడా పెంచింది.
ఇంతకు ముందు వరకు నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ లు.. భారీ ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. హిందీ సినిమాలతో పాటు తెలుగు తమిళ ఇతర సౌత్ భాషలకు సంబంధించిన సినిమాలను కూడా భారీ మొత్తాలకు కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో రేట్లను తగ్గించడం వల్ల ఖచ్చితంగా ఇండియాలో అమెజాన్ మరియు హాట్ స్టార్ లతో నెట్ ఫ్లిక్స్ ఢీ కొట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్స్ కు మరింత చేరువ అయ్యేందుకు రేట్లను తగ్గించిన నెట్ ఫ్లిక్స్ ఇకపై మరింత జోరుతో ఇండియన్ భాషల్లో కంటెంట్ ను ఇస్తే ఖచ్చితంగా భారీగా ఖాతాదారులు పెరిగే అవకాశాలు లేకపోలేదు.