Begin typing your search above and press return to search.
థియేటర్ ఫైర్ యాక్సిడెంట్.. సినిమాగా ఆ భయానక ఘటన..!
By: Tupaki Desk | 4 Jan 2023 9:45 AM GMTఅది ఫిబ్రవరి 13 ఢిల్లీ గ్రీన్ పార్క్ ఏరియాలో గల ఉపహార్ థియేటర్ జెపి దత్తా తీసిన బోర్డర్ సినిమా ఆడుతున్న రోజు. ఆర్మీ సాహసాలను అద్భుతంగా చూపించిన బోర్డర్ సినిమా అప్పటికే సూపర్ హిట్ అయ్యింది. మధ్యాహ్నం ఆట జరుగుతుండగా 3 గంటల ఆ టైం లో థియేటర్ లో ఒక్కసారిగా ఫైర్యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో 59 మంది ప్రేక్షకులు మృతి చెందారు.
దాదాపు 100కి పైగా ప్రేక్షకులు గాయాలపాలయ్యారు. అప్పటిదాకా సినిమా చూస్తున్న ప్రేక్షకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. థియేటర్ లో సరైన ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తేలింది. అయితే ఈ కేసు నుంచి ఆ థియేటర్ ఓనర్లు అన్సల్ బ్రదర్స్ తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నలు చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కోర్ట్ లో కేసు నడిచింది.
ఈ కేసు విషయమై 2015లో ఫైనల్ తీర్పు వచ్చింది. బాధితులకు 60 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్ట్ జడ్జ్ మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఘటనను తెర మీదకు తీసుకొస్తున్నారు. ట్రైల్ బై ఫైర్ అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని తెరకెక్కించింది.
జనవరి 13న ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అప్పట్లో థియేటర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అలా ఉంటే థియేటర్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఈ సినిమా చూపిస్తుంది.
ఈ సినిమాలో అభయ్ డియోల్, అశిష్ విద్యార్థి, అనుపం ఖేర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ తర్వాతే గవర్నమెంట్ థియేటర్స్ విషయంలో కఠినంగా ఉంది.
ట్రైల్ బై ఫైర్ సినిమా ఉపహార్ థియేటర్ ఘటనని కళ్లకు కట్టినట్టు చూపించబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీస్ పై బాగా దృష్టి పెడుతుంది. ఆల్రెడీ అప్పటి ప్రేక్షకులకు ఇదొక సెన్సేషన్ న్యూస్ కాగా అదే సినిమాగా వస్తుంది అని తెలియడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.