Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: దిగ్గజ ఓటీటీ పొగరు అలా అణిచేశారు..!
By: Tupaki Desk | 25 July 2021 6:41 AM GMTప్రాంతీయమే కదా అని తోక జాడిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజానికి అర్థమైంది. పోటీ దారు అయిన అమెజాన్ ప్రైమ్ తెలుగు భాషకు ఎంతో గౌరవం ఇచ్చి తెలుగైజ్ చేసి సినిమాలను చూపిస్తుంటే.. అసలు తెలుగు భాష అనేది ఒకటుందని ఈ భాష మాట్లాడే యూత్ సినిమా అంటే పడి చస్తారని గమనించలేకపోయిన సదరు ఓటీటీ ఇన్నాళ్లు లైట్ తీస్కుంది. పొగరు చూపించి విలువైన ఒరిజినల్ కంటెంట్ ని తెలుగు ఆడియెన్ కి అమ్ముకోలేకపోయింది. దీని పర్యవసానం నెట్ ఫ్లిక్స్ అంటే మనది కాదు! అని తెలుగు ఆడియెన్ ఎప్పుడూ భావించారు.
దానికి మూల్యం కూడా పెద్దదే. నిజానికి తెలుగు ఆడియెన్ ఇటీవల థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూడ్ లో లేరు. అందుకు కారణం ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ లో ప్రతి సినిమాని ఆల్మోస్ట్ తెలుగైజ్ చేసి అందిస్తుండడంతో వాటికి అడిక్ట్ అయ్యారు. అందుకు చాలా ప్రూఫ్ లు కనిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ కి అసాధారణ ఫాలోయింగ్ తెలుగు వారి నుంచి పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్ల వెబ్ సిరీస్ అంతటి ఘనవిజయం సాధించడానికి కారణం జాతీయ ఆడియెన్ తో పాటు తెలుగు ఆడియెన్ కూడా. ఈ సిరీస్ ని ఇక్కడ ఎంతో అభిమానంగా చూసారు. అమెజాన్ కంటెంట్ కి తెలుగు సబ్ టైటిల్స్ తో వీక్షించే వెసులుబాటు ఉండడం కూడా పెద్ద రేంజులోనే కలిసొస్తోంది. అసలు భాషతో సంబంధం లేకుండా ఇటీవల అన్ని భాషల చిత్రాలను తెలుగు ఆడియెన్ వీక్షిస్తున్నారు. కరోనా కల్లోలంలో ఇదొక నూతన ఒరవడి అని చెప్పాలి.
నెట్ ఫ్లిక్స్ క్షమాపణలు
అంతర్జాతీయ OTT దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తాజాగా తెలుగు ఆడియెన్ కి సారీ చెప్పింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ ను ప్రారంభించిన సదరు కంపెనీ... ఈ కొత్త హ్యాండిల్ ద్వారా తన ప్రాంతీయ విషయాలను (తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ కంటెంట్) ప్రోత్సహిస్తామని ప్రతినబూనింది. కానీ నెట్ ఫ్లిక్స్ తో తెలుగు వారికి సింక్ కుదరడం లేదు. పర్యవసానంగా నెట్ ఫ్లిక్స్ ఇక్కడి వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తప్పును కాస్త ఆలస్యంగా గ్రహించిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు దిద్దుబాటుకు రెడీ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ తెలుగు భాషను తక్కువ చేసిందని తెలుగు వారంతా విమర్శిస్తున్నారు. దీనికి కారణం ట్విట్టర్లో `తెలుగూస్` అని ప్రస్థావిస్తూ మన భాషపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడమే. అందుకు తీవ్రమైన ట్రోల్స్ ని నెట్ ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది.
అయితే నెట్ ఫ్లిక్స్ ట్విట్టర్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పి.. వారి శైలిలో చక్కదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఇండియా `సౌత్ అనే నేను` ఈ హ్యాండిల్ అడ్మిన్ గా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇది మా వాగ్దానం అంటూ నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ సంభాషణ భరత్ అనే నేనులో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ని ప్రతిబింబిస్తుంది.
అంతఃకరణ శుద్ధితో అంటూ మహేష్ ఎంతో పవర్ ఫుల్ గా చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసింది ఈ తీర్మానం. ఇకపై సరైన తెలుగులో ట్వీట్ చేస్తామని ఒటిటి దిగ్గజం హామీ ఇచ్చింది. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ దుందుడుకు తనానికి చిన్న చూపునకు అలా చెక్ పెట్టారన్నమాట. 8 కోట్ల తెలుగు ప్రజల విషయంలో ఎవరికైనా `అశ్రద్ధ.. అజాగ్రత్త.. చిన్న చూపు` తగదనేది నిరూపణ అయ్యింది ఈ సందర్భంలో.