Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కు నెట్ ఫ్లిక్స్ భారీ షాక్!
By: Tupaki Desk | 20 Aug 2022 10:30 AM GMTయంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత నుంచి బాలీవుడ్ కు వరుస సాకులు తగులుతున్నాయి. బాలీవుడ్ లో వున్న నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ సింగ్ చనిపోయాడంటూ అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ పై దుమ్మెత్తిపోశారు. అంతే కాకుండా బాలీవుడ్ లో ఎలాంటి సినిమా నేపథ్యంలేని వాళ్లని తొక్కేస్తున్నారంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ని బాయ్ కాట్ చేయిండి అంటూ కొత్త నినాదం పుట్టికొచ్చింది.
అప్పటి నుంచి బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో, టైర్ టు హీరో సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోందని ప్రచారం మొదలైన ప్రతీ సారి ఆయా సినిమాలని బాయ్ కాట్ చేయిండి అంటూ సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదం కారణంగా భారీ స్థాయిలో జిజాస్టర్ అవుతూ వస్తోంది. రీసెంట్ గా విడుదలైన అమీర్ ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డా' కూడా ఇదే నినాదం కారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇదిలా వుంటే కరోనా నుంచి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న బాలీవుడ్ మేకర్స్ కొంత మంది కరోనా ఫోర్త్ వేవ్ వస్తే ఇండస్ట్రీ పరిస్థితి ఏంటనే ఆలోచనతో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం బంచ్ ఆఫ్ స్మాల్ ఫిలింస్, వెబ్ సిరీస్ లని నిర్మించారట. ఇందులో అనురాగ్ కశ్యప్, ఏక్తా కపూర్ కూడా వున్నారట. వీరు భారీ స్థాయిలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలని నిర్మించి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట.
అయితే చివరి నిమిషంలో నెట్ ఫ్లిక్స్ వీరికి గట్టి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 50 సినిమాల వరకు ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే వాటిని ముందు థియేటర్లలో రిలీజ్ చేయండి... ఆ తరువాతే ఓటీటీకి తీసుకుంటామని నెట్ ఫ్లిక్స్ వర్గాలు కండీషన్ పెట్టారట.
దీంతో చేసేది లేక వన్ బై వన్ థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే అవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయట. అలాంటి సినిమాలని ఓటీటీక ఇతీసుకోమని నెట్ ఫ్లిక్స్ తాజాగా మరో షాక్ ఇవ్వడంతో ఈ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో తాప్సీ నటించిన దుబారా, తను నిర్మించిన 'బ్లార్', ఏలియన్ వంటి సినిమాలు కూడా వున్నాయని తెలిసింది. ఇక ఈ 50 సినిమాల్లో ఏక్తా కపూర్ 10 సినిమాలు వుండటం విశేషం.