Begin typing your search above and press return to search.
తిరుపతి కుర్రాళ్లను పర్మినెంట్ గా కొనేసిన NETFLIX!
By: Tupaki Desk | 6 Aug 2022 2:30 AM GMTహైర్ చేసుకోవడం.. కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం లేదా డీల్ మాట్లాడుకోవడం .. ఎలా చెప్పుకున్నా కానీ ఇద్దరు తెలుగు కుర్రాళ్లను నెట్ ఫ్లిక్స్ పర్మినెంట్ గా కొనుక్కుందని భావించవచ్చు. ఇంతకీ ఎవరా ఇద్దరు తెలుగు కుర్రాళ్లు? అంటే.. తిరుపతి(ఆంధ్రా)కి చెందిన ట్యాలెంట్ రాజ్ & డీకే.
ఈ జోడీ ఆరంభం బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసారు. అక్కడ నిర్మాతలుగా మొదలై దర్శకులుగాను సత్తా చాటారు. వరుసగా క్రేజీ సినిమాలతో పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తో రాజ్ అండ్ డీకే పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. ఈ సిరీస్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. గత కొంతకాలంగా ఆ ఇద్దరు ప్రతిభావంతులు నెట్ ఫ్లిక్స్ సినిమాలతో మోతెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో డీల్ ని అదే సంస్థతో కుదుర్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్ ఆ ఇద్దరినీ కొన్నేళ్ల పాటు బ్లాక్ చేసింది. సదరు సంస్థ మల్లీ ఇయర్ క్రియేటివిటీ కోసం భాగస్వామ్య ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది.
D2R ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో తదుపరి ప్రాజెక్ట్ లను ఈ యువ ప్రతిభావంతులు అభివృద్ధి చేస్తారు. వారు స్వయంగా నిర్మించి నెట్ ఫ్లిక్స్ కి అందిస్తారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 2021 తెలుగు చిత్రం `సినిమా బండి` నిర్మాతలుగా.. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ `గన్స్ అండ్ గులాబ్స్` దర్శకులుగా...నెట్ ఫ్లిక్స్ తో వీరిద్దరూ ఇప్పటికే సత్సంబంధాలను కలిగి ఉన్నారు.
గన్స్ అండ్ గులాబ్స్ నేర ప్రపంచంలో ప్రేమ- అమాయకత్వం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కింది. మొదటి ప్రేమ నుండి మొదటి హత్య వరకు అన్ని రకాల మొదటి విషయాలతో కూడుకున్న వ్యామోహాల కథ ఇది. యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించింది. సినిమా బండి కూడా విలక్షణమైన కథాంశంతో రూపొందింది.
ఎక్కువగా హిందీ కంటెంట్ కోసం పని చేసిన అనుభవం రాజ్ అండ్ డీకే సొంతం. ఇండీ డ్రామా `షోర్ ఇన్ ది సిటీ` (2010)... స్టోనర్ కామెడీ `గో గోవా గాన్` (2013).. హారర్ కామెడీ స్ట్రీ (2018)తో రాజ్ అండ్ డీకే తమ ప్రభావం చూపగలిగారు. జానర్-బెండింగ్ కంటెంట్ ను రాయడం వాటికి దర్శకత్వం వహించడంలో ఆ ఇద్దరూ సుప్రసిద్ధులు.
పాపులర్ వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్`కి రెండు సీజన్ ల కథలను కూడా రాజ్ అండ్ డీకే రాసి వాటికి దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్ పేయి ఈ సిరీస్ లో గూఢచారిగా నటించగా సమంత- ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది ప్రసారమైంది. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ గా వెలిగిపోతున్నారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో మరో బిగ్ డీల్ కుదుర్చుకోవడం ఆసక్తిని పెంచుతోంది.
నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ -``భారతదేశంలో ఒరిజినల్ సృజనాత్మక కంటెంట్ తో దూసుకెళుతున్న ప్రతిభావంతులు రాజ్ & డికె. వారి యూనిక్ స్టైల్.. తెలివిగా కథ చెప్పే విధానంతో పాటు... వారు పవర్ హౌస్ స్టూడియో అధినేతలుగానూ పాపులరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్ ఫ్లిక్స్ సభ్యులకు అద్భుతమైన వినోదాన్ని అందించే మల్టీ ఇయర్ (కొన్నేళ్లప పాటు) సృజనాత్మక భాగస్వామ్యం కోసం వారితో మా సంబంధాన్ని కొనసాగించడానికి ఎంతో సంతోషిస్తున్నాం`` అని తెలిపారు.
రాజ్ & DK దీనిపై మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ స్పేస్ లో అగ్రగామిగా ఉంది. చిత్రనిర్మాణానికి .. చిత్రనిర్మాతలకు నిస్సంకోచంగా ఎమోషనల్ కనెక్ట్ తో మద్దతునిస్తున్నారు. మేం మునుముందు అతి భారీగా ప్రత్యేకమైన కథలతో సినిమాలను రూపొందించడానికి ఎదురుచూస్తున్నాం.. ఎగ్జయిట్ చేసే కథలతో గొప్ప స్క్రీన్ ప్లేతో రీఫ్రెషింగ్ విజువల్స్ ని అందించడం మా పని. ఇందులో మాకు మేమే సవాల్ విసురుకుంటాం`` అని తెలిపారు.