Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ డీల్ అందుకే క్యాన్సిల్ చేసిందా?

By:  Tupaki Desk   |   19 July 2022 10:30 AM GMT
నెట్ ఫ్లిక్స్ డీల్ అందుకే క్యాన్సిల్ చేసిందా?
X
కోలీవుడ్ ప్రేమ జంట న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల‌కు పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ షాకిచ్చిందా? అంటే కోలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాథానం చెబుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ షాక్ వ‌ల్ల ఈ జంట దాదాపు 25 కోట్లు న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని వార్త‌లు జోరుగాఈ వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే... గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌లో వున్న కోలీవుడ్ క్రేజీ ల‌వ్ బ‌ర్డ్స్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ గ‌త కొంత కాలంగా పెళ్లి పై దాట వేస‌క్తూ వచ్చారు. ఫైన‌ల్ గా వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పెళ్లికి రెడీ అయిపోయారు.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పెళ్లి వార్త‌ని బ‌య‌ట‌పెట్టిన న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఎట్ట‌కేల‌కు జూన్ 9న అనుకున్న‌ట్టుగానే పెళ్లి చేసుకున్నారు. చెన్నై స‌మీపంలోని మ‌హాబ‌లిపురంలో గ‌ల రిసార్ట్ లో ప్ర‌త్యేకంగా వీరి వివాహ వేడుక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఇరు కుటుంబాల‌కు చెందిన బంధువులు, మిత్రుల‌తో పాటు కోలీవుడ్ కు చెందిన స్టార్స్ భారీ స్థాయిలో పాల్గొన్నారు. అందులోనూ న‌య‌న‌తార‌తో క‌లిసి న‌టించిన స్టార్ హీరోలు, హీరోయిన్ లు కూడా వున్నార‌ట‌.

అందులో ర‌జ‌నీకాంత్‌, మ‌ణిర‌త్నం, షారుఖ్ ఖాన్‌, కార్తీ, జ‌యం ర‌వి, అట్లీ కుమార్‌, సూర్య‌, జ్యోతిక‌, అట్లీకుమార్, అనిరుధ్‌, ఏ.ఆర్‌. రెహ‌మాన్‌ తో పాటు చాలా మందే కోలీవుడ్ సెల‌బ్రిటీలు వివాహ వేడుక‌లో పాల్గొన్నారు. కొంత మంది ఫొటోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఒక మెమ‌ర‌బుల్ ఈవెంట్ లా ప్లాన్ చేశారు. ప్ర‌త్యేకంగా దీన్ని షూట్ చేసే బాధ్య‌ల్ని ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్ట్ గౌత‌మ్ మీన‌న్ కు అప్పగించారు.

అంతే కాకుండా దీని స్ట్రీమింగ్ హ‌క్కుల కోసం నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ ని కుదుర్చుకున్నార‌ట‌. ఆ డీల్ మొత్తం 25 కోట్ల‌ని తెలుస్తోంది. అయితే అందులో కొంత మొత్తాన్ని ముందే అడ్వాన్స్ గా స్వీక‌రించార‌ట‌.

అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ అనూహ్యంగా ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణంగా విఘ్నేష్ శివ‌న్ అని తెలుస్తోంది. ఇటీవ‌ల పెళ్లి జ‌రిగి నెల కావ‌స్తున్న నేప‌థ్యంలో పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇలా తాము చేసుకున్న ఒప్పందానికి విరుద్దంగా ఫొటోల‌ని, వీడియో క్లిప్ ల‌ని విడుద‌ల చేయ‌డంతో నెట్ ఫ్లిక్స్ వ‌ర్గాలు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అర్థాంత‌రంగా ర‌ద్దు చేసుకున్నాట‌. అంతే కాకుండా డీల్ లో భాగంగా అడ్వాన్స్ గా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ ఈ వివాదంపై దిగిరాని ప‌క్షంలో న‌య‌న‌తార, విఘ్నేష్ శివ‌న్ లు 25 కోట్లు న‌ష్టాపోవ‌డం ఖాయంగా తెలుస్తోంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.