Begin typing your search above and press return to search.
ఆ ఓటీటీకి ఆయువు పోసే సిరీస్ లొస్తున్నాయ్
By: Tupaki Desk | 6 Sep 2022 2:30 AM GMTఅమెజాన్ ప్రైమ్.. హాట్ స్టార్ తరహాలోనే నెట్ ఫ్లిక్స్ భారతదేశంలో సత్తా చాటాలని సీరియస్ గా ప్రయత్నాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారతీయ కంటెంట్ తో ఒరిజినల్ సిరీస్ లను రూపొందిస్తూ గ్రిప్ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అదే క్రమంలో పలువురు హిందీ అగ్ర తారలతో సిరీస్ లను కూడా నిర్మిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ ఇటీవల భారతీయ కంటెంట్ లైబ్రరీకి కొత్త టీవీ షోలు సినిమాలను జోడిస్తూనే ఉంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లో తదుపరి భారతీయ ఒరిజినల్ సిరీస్ ల జాబితాలో మాధురీ దీక్షిత్ - తాప్సీ పన్ను- ఆర్. మాధవన్ సహా ఎందరో ప్రముఖ బాలీవుడ్ స్టార్లు నటించిన సిరీస్ లు సినిమాలతో దూసుకొస్తోంది.
థ్రిల్లర్ ల నుండి రొమాంటిక్ కామెడీల వరకు.. రియాలిటీ షోల నుండి లైట్ హార్టెడ్ డ్రామాల వరకు తదుపరి ఇండియన్ ఒరిజినల్ సిరీస్ లు త్వరలో నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానున్నాయి. అవన్నీ 2022లో ప్లాట్ ఫారమ్ లోకి రానున్నాయి. అయితే కొన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకు వస్తున్న ఎగ్జయిటింగ్ సిరీస్ ల టైటిల్స్ వాటి వివరాలను పరిశీలిస్తే...ఆసక్తికర విషయాలున్నాయి.
నెట్ ఫ్లిక్స్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. స్ట్రేంజర్ థింగ్స్- ది విట్చర్- బ్రిడ్జర్ టన్ ఇలా ఎన్నో సిరీస్ లతో ఒరిజినల్ చలనచిత్రాలు సిరీస్‌లతో ఆకట్టుకోవడం వల్లనే ఇది విదేశాల్లో బలంగా ఉంది. వేలకొద్దీ సినిమాలు టీవీ షోలను వీక్షించడానికి అందిస్తుంది.
Netflixలో రాబోయే భారతీయ ఒరిజినల్ సిరీస్ లను పరిశీలిస్తే..
ఢిల్లీ క్రైమ్ సీజన్ 2 -జమతారా సీజన్ 2-రానా నాయుడు- మసాబా మసాబా సీజన్ 2- హీరమండి-ఖుఫియా క్యూలో ఉన్నాయి.
ఢిల్లీ క్రైమ్ S2 ఇండియన్ ఒరిజినల్ నెట్ ఫ్లిక్స్
క్రైమ్ సిరీస్ లో మొదటి సీజన్. ఢిల్లీ క్రైమ్ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా గౌరవం దక్కించుకుంది. ఎమ్మీ అవార్డ్-విజేత నటించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం రెండవ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. దేశాన్ని కుదిపేసిన కేసును ఛేదించిన తర్వాత IPS అధికారిణి వర్తికా చతుర్వేది (షెఫాలీ షా) ఆమె బృందం కొత్త సవాల్ కు సిద్ధమవుతుంది. ప్రజలు భయంతో ఈ పోరాటానికి సహాయం చేస్తారా లేదా? అన్నది చూడాలి.
2. జమ్తారా: సబ్కా నంబర్ అయేగా (సీజన్ 2)
మరో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ `జమ్తారా` తిరిగి ఫిషింగ్ ప్రపంచంలోకి దూకుతుంది. పెద్ద ఆటగాళ్ళు జమ్తారాలోకి ప్రవేశిస్తారు. రాజకీయాలు ఫిషింగ్ ను నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి. అయితే ఫిషింగ్ రాజకీయాలను నియంత్రించడంలో జమ్తారా సఫలమవుతుంది. షో మొదటి సీజన్ ని చూడకుంటే ఇప్పుడు సీజన్ 2 కంటే ముందే దానిని వీక్షించాలి. ఆ తర్వాత సీజన్ 2లో జాయినవ్వొచ్చు.
3. రానా నాయుడు
బాలీవుడ్ స్టార్స్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు? స్ట్రీమింగుకు రానున్న ఈ క్రైమ్ డ్రామాలో తెలుగు సూపర్ స్టార్ లు రానా దగ్గుబాటి- వెంకటేష్ దగ్గుబాటి నటించారు. ధనవంతులు పాపులర్ పర్సనాలిటీస్ కి సమస్య ల పరిష్కారాలు ఇచ్చేవాళ్లుగా వారు కనిపిస్తారు. ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ ఒరిజినల్ లో విడుదలవుతుంది.
4. మసాబా మసాబా (సీజన్ 2)
ఇది కఠినమైన ప్రపంచం.. కానీ మసాబా.. నీనా గుప్తాలు ఇంకా కఠినమైనవాళ్లు. ఈసారి ప్రణాళిక ప్రపంచ ఆధిపత్యం సాధించడం గురించి.. మసాబా కెమెరా ముందుకి వెళుతుంది.. నీనా వారి వెనుక వెళ్లాలని నిర్ణయించుకుంది. కొత్త ప్రేమలు పాత ప్రేమలు కొన్ని అసాధ్యమైన ప్రేమలతో ఈ కథ ఆద్యంతం రక్తి కట్టించనుంది. ఇద్దరు ఆడాళ్లు తమ కెరీర్ స్నేహాలను ఎలా నడిపిస్తారు? ప్రేమికులను తమ చేతుల్లోకి తీసుకుని ప్రతిదానిని తమవైపు ఎలా తిప్పుకుంటారో తెరపై చూస్తారు.
5. హీరమండి
Netflix ఒరిజినల్స్ లో ప్రఖ్యాత దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న హీరా మండి పై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలోని వేశ్యల జీవితాలలో ప్రేమ ద్రోహం వంటి కథలను ఆవిష్కరిస్తుంది.
6. ఖుఫియా
ఖుఫియా అనేది విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ . ఇది అమర్ భూషణ్ రచించిన పాపులర్ గూఢచర్య నవల ఎస్కేప్ టు నోవేర్ ఆధారంగా రూపొందించినది. ఇది ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది కానీ ఇంకా అక్కడా తేదీని నిర్ణయించలేదు. ఇండియన్ ఒరిజినల్ ఫిల్మ్ లో టబు- అలీ ఫజల్- వామికా గబ్బి -ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు.
ఇవన్నీ తదుపరి వారాలు నెలల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ .. Netflix ఈ జాబితాకు కొత్త భారతీయ టీవీ కార్యక్రమాలు లేదా చలనచిత్రాలను జోడించాలని ప్లాన్ చేస్తోంది.
ఇవి ఇంకా క్రేజీగా ఎగ్జయిటింగ్ గా..
1984లో జరిగిన యాంటీ సిక్ ఉద్యమం నేపథ్యంతో తెరకెక్కిన `జోగి` ఈ నెల 16న స్ట్రీమింగుకి రానుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. 1930నాటి పీరియడ్ డ్రామా ఖల మిస్టరీ థ్రిల్లర్. నటవారసులను పరిచయం చేస్తూ జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ కొందరి భవిష్యత్ ని నిర్ధేశిస్తుంది. నటవారసులు సుహానా ఖాన్- ఖుషీ కపూర్- అగస్త్య నంద ఈ సిరీస్ తో తెరంగేట్రం చేయడం ఉత్కంఠను పెంచుతోంది. సాన్య మల్హోత్రా కథల్ కూడా రానుంది. అనుష్క శర్మ క్రికెటర్ గా నటించిన `చక్ దా ఎక్స్ ప్రెస్`- తమన్నా `ప్లాన్ ఏ ప్లాన్ బి`... యామి- చోర్ నికల్ కె భాగా కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో రూపొందిన `మోనికా మై డార్లింగ్`.. మిస్టరీ కథాంశంతో టబు ప్రధాన పాత్రలో విశాల్ భరద్వాజ్ ఖుఫియా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవన్నీ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ కావడంతో చాలా ఆసక్తి నెలకొంది.