Begin typing your search above and press return to search.
పరువు హత్యల్ని పాతరేసే సిరీస్
By: Tupaki Desk | 2 Dec 2019 9:09 AM GMTకులాంతర ప్రేమకథలు.. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే పలు భాషల్లో సినిమాలొచ్చాయి. అప్పట్లో మరాఠాలో తెరకెక్కిన సైరాఠ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సినిమా బాలీవుడ్ లో జాన్వీ ని కథానాయికగా.. ఇషాన్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ధడక్ పేరుతో రీమేక్ చేశారు. ఇక తెలుగులోనూ నిర్మాత లగడపాటి శ్రీధర్ వారసుడితో ఈ తరహా ప్రయత్నం చేశారు. ఇక కులం కొట్లాటపై ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి.
అయితే ఇప్పుడు హానర్ కిల్లింగ్స్ (పరువు హత్యలు)పై ఆంథాలజీ ఫిలింస్ తెరకెక్కిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విదేశీ కార్పొరెట్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఇండియా భాషల్లో హానర్ కిల్సింగ్స్ పై భారీ సినిమాల్ని ప్లాన్ చేసింది. దీనికి గౌతమ్ మీనన్- వేట్రి మారన్- విఘ్నేష్ శివన్- సుధ కొంగర వంటి దర్శకుల్ని ఎంపిక చేసుకుని ఆంథాలజీ ఫిలిమ్(మూడు నాలుగు కథలు కలిపి)ని తెరపైకి తీసుకురానుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సాయి పల్లవి- ప్రకాష్ తారాగణంగా వేట్రిమారన్ తన పార్ట్ కి వర్క్ చేయనుండగా.. అంజలి- కల్కి కొచ్లిన్ ప్రధాన పాత్రలు పోషించే సెగ్మెంట్ కి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నాడు. మరో ఇద్దరు దర్శకులు ఏ పార్ట్ లకు పని చేస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ తెరకెక్కిస్తున్నా..ఈ ఆంథాలజీనే తెలుగు వెర్షన్ లో నందిని రెడ్డి -తరుణ్ భాస్కర్- సంకల్ప్ రెడ్డి ద్శకత్వం వహించనున్నారట.