Begin typing your search above and press return to search.
న్యూడ్ ఫోటోలు కోరితే.. అవి పంపిన సింగర్!
By: Tupaki Desk | 22 May 2019 9:38 AM GMTమనకు సోషల్ మీడియా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని మనం రెగ్యులర్ లైఫ్ నుండి వేరు చేసి చూడడం కష్టం. అయితే ప్రతి విషయానికి బొమ్మా బోరుసూ ఉన్నట్టే ఈ సోషల్ మీడియాకు కూడా పాజిటివ్ నెగెటివ్ ఉన్నాయి. ట్రోలింగ్ చేయడం.. అసభ్యకరంగా ప్రవర్తించడం అనేవి సాధారణ విషయాలుగా మారిపోయాయి. సెలబ్రిటీలకు ఈ బెడద మరీ ఎక్కువ. తాజాగా సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదకు అలాంటి ఒక సంఘటన ఎదురైంది.
ఒక నెటిజనుడు చిన్మయిని "నగ్న చిత్రాలు పంపు" అంటూ మెసేజ్ ఇచ్చాడు. దీనికి సమాధానంగా చిన్మయి తనవద్ద నున్న న్యూడ్ లిప్ స్టిక్స్ ఫోటోను పంపింది. ఆ వాట్సాప్ చాట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. న్యూడ్ లిప్ స్టిక్ అంటే తెలుసు కదా? ఏ కలర్ లేకుండా పారదర్శకంగా ఉండే లిప్ స్టిక్ ను న్యూడ్ లిప్ స్టిక్ అంటారు. దీంతో ఆ నెటిజనుడికి దిమ్మతిరిగింది. చాలామంది నెటిజనులు ఆ మంచి చెడు తెలీని వ్యక్తికి సరైన సమాధానం చెప్పావు అంటూ చిన్మయిని మెచ్చుకున్నారు.
చిన్మయికి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లకు.. ట్రోలింగ్ మేసేజులకు స్పందించడం కొత్తేమీ కాదు. ఎప్పుడైతే తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో అప్పటినుంచి ఇవి ఆమెకు కామన్ అయ్యాయి. ఒక్క వైరముత్తు మాత్రమే కాకుండా ఇతరులకు సంబంధించిన లైంగిక వేధింపుల సంఘటనలపై స్పందిస్తూ ఉండడంతో చిన్మయికి సోషల్ మీడియాలో శత్రువులు ఎక్కువయ్యారు. అయితే చాలాసార్లు తనను వేధించిన వారికి దీటుగా సమాధానం చెబుతూ నెటిజనుల ప్రశంశలు అందుకుంటోంది చిన్మయి.