Begin typing your search above and press return to search.

పైరసీ వీడియోలపై మాట్లాడిన నిఖిల్ కు షాకిచ్చిన నెటిజన్

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:33 AM GMT
పైరసీ వీడియోలపై మాట్లాడిన నిఖిల్ కు షాకిచ్చిన నెటిజన్
X
కొన్ని వాదనలకు అన్నిసార్లు ఆదరణ ఉండదు. కొన్నిసార్లు దిమ్మ తిరిగేలా షాక్ ఎదురవుతుంది. తాజాగా అలాంటి అనుభవమే యువ హీరో నిఖిల్ కు ఎదురైంది. అతగాడు నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలో మార్కెట్లో దొరకటం.. ఒక బండి మీద చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని రీతిలో నిఖిల్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం చెప్పేందుకు ఈ యువహీరో కిందామీదా పడ్డారు. ఇంతకీ ఆ ప్రశ్నేమంటే.. టికెట్ రేటు కంటే థియేటర్ లో పాప్ కార్న్ ధర ఎక్కువగా ఉంది. నిర్మాతలు.. నటులు.. దర్శకులు ఈ విషయాల్ని మర్చిపోతున్నారు.

ఒక మల్టీఫ్లెక్స్ లో సినిమా చూసేందుకు వెళితే అరలీటరు వాటర్ బాటిల్ ను రూ.60కు అమ్ముతున్నారు. థియేటర్ బయట రూ.20కు దొరికే బాటిల్ ను రూ.120కు అమ్ముతున్నారు. ఇదెంతవరకూ న్యాయం? అని ప్రశ్నించారు. దీనికి నిఖిల్ స్పందిస్తూ నేనూ ఒక ఫేమస్ థియేటర్ కు వెళ్లానని.. డైట్ కోక్ కు రూ.300 తీసుకున్నారని.. ఆ ధర చూసి తానే ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. అక్కడ అమ్మే వ్యక్తిని నిలదీశానని.. తప్పు అతనిది కాదు మల్టీఫ్లెక్సులు ఆ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. తమకు జరిగే అన్యాయం గురించి సినిమావాళ్లు ఆలోచిస్తారు కానీ.. వారి సినిమాల్ని చూసే ప్రేక్షకులకు జరిగే అన్యాయం గురించి ఈ సినిమా వాళ్లు ఎందుకు ఆలోచించరబ్బా?