Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మికి సవాల్‌ విసిరిన నెటిజన్‌

By:  Tupaki Desk   |   17 Oct 2018 3:48 AM GMT
మంచు లక్ష్మికి సవాల్‌ విసిరిన నెటిజన్‌
X
సినీ ప్రముఖులు - క్రీడాకారులు బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా వ్యవహరించడం కొత్తేం కాదు. ఈమద్య కాలంలో సినిమాలతో కంటే కొందరు స్టార్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గానే ఎక్కువ సంపాదిస్తున్నారంటూ సోషల్‌ మీడియా టాక్‌. టాలీవుడ్‌ నుండి ఇప్పటికే ఎంతో మంది సెలబ్స్‌ ఎన్నో బ్రాండ్స్‌ కు ప్రచారం చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్‌ నుండి అత్యధిక బ్రాండ్స్‌ కు మహేష్‌ బాబు అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి కూడా ఒక బ్రాండ్‌ ను నెత్తికి ఎత్తేసుకుంది.

అత్యంత వివాదాస్పదం అయిన కుర్‌ కురే కు మంచు లక్ష్మి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఎంపిక అయ్యింది. ఆమద్య కుర్‌ కురే పై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్‌ కు కూడా గురైన కుర్‌ కురే కు మంచు లక్ష్మి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించడాన్ని కొందరు నెటిజన్స్‌ తప్పుబడుతున్నారు. తాజాగా మంచు లక్ష్మి యాడ్‌ వస్తోంది. ఆ యాడ్‌ లో మంచు లక్ష్మి తాను కోల్‌ కత్తా లోని కుర్‌ కురే తయారీ కేంద్రంకు వెళ్లానని, అక్కడ చాలా సురక్షితంగా ఇది తయారవుతుందని చెబుతోంది.

మీరు ఎంతో సురక్షితం అంటూ చెబుతున్న కుర్‌ కురే ను మీ కూతురు లేదా మంచు విష్ణు పిల్లలకు పెట్టగలరా, వారు తినే వీడియోను పోస్ట్‌ చేయగలరా అంటూ సవాల్‌ విసిరాడు. మీరు ఆచరించి, ఆ తర్వాత మాకు చెప్పాలని, మీ పిల్లలు ఆరోగ్యవంతమైన ఫుడ్‌ తింటారు, మమ్ముల మాత్రం ఇలాంటివి తినమని సలహా ఇస్తారా అంటూ మరో నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి మంచు లక్ష్మి మొదటి ప్రయత్నంపై ఇలాంటి విమర్శలు రావడంతో మంచు ఫ్యాన్స్‌ ఒకింత నిరుత్సాహంగా ఉన్నారు.