Begin typing your search above and press return to search.
ఎవరీ బుడబుక్కలోడు తేడాగా ఉన్నాడు!
By: Tupaki Desk | 17 Feb 2020 12:45 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోల్లో రణవీర్ సింగ్ కాస్త డిఫరెంట్. హీరోలందరిలో యూనిక్ గా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. మనం ఏం చేసినా వెరైటీగా ఉండాలి అనే టైపు. జనాలు నిరంతరం తన గురించి మాట్లాడుకోవాలి.. అటెన్షన్ తనవైపే ఉండాలని భావిస్తాడు. సినిమాల్లో ఊహాతీతమైన గెటప్పులు ఎలా ఉంటాయో? రియల్ లైఫ్ లోనూ అలాంటివే ప్రయత్నిస్తుంటాడు. స్టార్ హీరో అనే స్టాటస్ మరిచి వెరైటీగా కనిపించడానికి ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. తాజాగా అదే ప్రూవ్ అయింది. విచిత్రమైన వేషధారణతో నెటిజనుల ట్రోలింగ్ కు అడ్డంగా దొరికిపోయాడు.
ఇటీవలే 2020 ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ముగించికుని ముంబై ఎయిర్ పోర్టులో రణవీర్ డిఫరెంట్ గెటప్ తో ల్యాండ్ అయ్యాడు. మెటాలిక్ కలర్ లాంగ్ కొట్ ని మోకాళ్ల వరకూ వేసుకుని బూచోడిలా కనిపించాడు. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ టీషర్ట్ .. ఆ పైన పాకెట్లతో వదులుగా ఉన్న ఆ లాంగ్ కోట్ ఒకరకంగా భయపెట్టేసింది. నెత్తిన నల్లరంగు టోపీ పెట్టుకుని...కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని మాఫియా వాడిలా కనిపించాడు. ఆ గెటప్ లో రణవీర్ ని చూసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది..అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరీ బూచోడు? ఏమిటీ జోకర్ గెటప్? మన దేశమేనా? కరేబియన్ దేశస్తుడా? అంటూ వింతగా చూసారు.
ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజనులు కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. రణబీర్ ఫ్యాషన్ పిచ్చి పీక్స్ కు చేరింది. లేకపోతే ఈ బుడబుక్కల అవతారం ఏంటి? ఇలాంటి గెటప్ లతో చిన్న పిల్లలను భయపెడతాడా? అభిమానులను ఇదేమి సర్ ప్రైజ్ ? చాలు చాలు నీ పగటి వేషాలు! అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతటితో ఆగని ఇంకొంత మంది దీపిక మీ ఆయన్ని కంట్రోల్ లో పెట్టు? ఇలా విచిత్రమైన బట్టల్లో మీ ఆయన్ని చూడలేకపోతున్నాం అంటూ మండిపడుతున్నారు. మరి రణబీర్ దీనికి ఎలా స్పందిస్తాడో?