Begin typing your search above and press return to search.

అయ్యో ఆచార్య.. నువ్వైనా కనిపెట్టొద్దా కాపీని!

By:  Tupaki Desk   |   5 Jan 2022 1:30 AM GMT
అయ్యో ఆచార్య.. నువ్వైనా కనిపెట్టొద్దా కాపీని!
X
ఈమద్య కాలంలో పెద్ద హీరోల సినిమాల పాటల్లో ఎక్కువ శాతం ఏదో ఒక వివాదాన్ని మూట కట్టుకుంటున్నాయి. చాలా పాటలు కాపీ అంటూ విమర్శల పాలవుతుంటే మరి కొన్ని పాటలు మా మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనోభావాలను దెబ్బ తీసే పాటల విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే కాపీ పాటల గురించి నెట్టింట రెగ్యులర్ గా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్‌ కు చెందిన ఈ దర్శకుడు ఆ దర్శకుడు అని కాకుండా అందరు టాప్‌ సంగీత దర్శకుల పాటలకు కూడా కాపీ మరక అంటుంతోంది. వారు ఏదో ఇన్సిపిరేషన్ గా తీసుకుని ట్యూన్‌ చేయడం.. ఆ పాటను కాస్త పోలి ఉండటంతో నెటిజన్స్ ఓ రేంజ్‌ లో ఆట ఆడేసుకోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ఇన్సిపిరేషన్ గా తీసుకున్నా ఉన్నదిఉన్నట్లుగా వచ్చేస్తుంది. అప్పుడు మరింత తలనొప్పి తప్పదు. ఇప్పుడు ఆ తలనొప్పి ఆచార్య ఐటెం సాంగ్ కు మొదలయ్యింది.

కొత్త సంవత్సరంలో టాలీవుడ్‌ కు మంచి బిగినింగ్‌ అనుకుంటూ ఆచార్య ఐటెం సాంగ్ ను స్ట్రీమింగ్‌ చేస్తున్న వారికి ఇది ఆ పాట కదా అంటూ కొందరు నెటిజన్స్ కాపీ ప్రచారం మొదలు పెట్టారు. బాలీవుడ్‌ లో 1985 లో వచ్చిన జిలేలే జిలేలే ట్యూన్‌ ను పల్లవి కోసం ఉన్నది ఉన్నట్లుగా మణిశర్మ వాడేశాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ అంటూ పొగడ్తలు దక్కించుకున్న మణిశర్మ మద్యలో ఓ పదేళ్లు పెద్దగా కనిపించలేదు. మళ్లీ ఆయన ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. గత అనుభవం అనుబంధం దృష్టిలో ఉంచుకుని చిరంజీవి తన ఆచార్య సినిమాకు కొరటాల శివను ఒప్పించి మరీ మణిశర్మను తీసుకోవడం జరిగింది. చిరంజీవి నమ్మకం వమ్ము చేయకుండా లాహే లాహే సాంగ్‌ ను అద్బుతంగా అందించాడు. నీలాంబరి పాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు విడుదల అయిన శానా కష్టం వచ్చింది అనే ఐటెం సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదల అయిన తక్కువ సమయంలోనే మిలియన్‌ వ్యూస్ ను రాబట్టి రికార్డును దక్కించుకుంది. మరో వైపు పాటలో చిరంజీవి స్టెప్పులు.. రెజీనా అందాలు.. కొరటాల టేకింగ్‌ అంటూ అభిమానులు చర్చించుకుంటూ మురిసి పోతు సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తున్న సమయంలో కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకే వారు ఇప్పుడు కాపీ అంటూ కాకి కూతలు మొదలు పెట్టారు. అభిమానులు ఆ విషయాలను పట్టించుకోకుండా ఆచార్య సినిమా కోసం వెయిట్‌ చేయండి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కొందరు మీడియా వర్గాల వారు మరియు అభిమానులు మాత్రం అయ్యో ఆచార్య యూనిట్‌ సభ్యులైనా ఈ విషయాన్ని గమనించాలి కదా.. మణిశర్మ ఇచ్చాడు సరే దాన్ని సరి చూసుకునే సమయంలో గుర్తించాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాటలకు ఇలాంటి వివాదాలు కామన్‌.. వాటి వల్ల భారీ వ్యూస్ కామన్‌. కనుక మరక మంచిదే అన్నట్లుగా ఈమద్య వివాదాలు కూడా మంచికే అవుతున్నాయి.