Begin typing your search above and press return to search.

ఆలియా తెలుగు భాషా నైపుణ్యానికి ఫిదా

By:  Tupaki Desk   |   13 Dec 2021 6:36 AM GMT
ఆలియా తెలుగు భాషా నైపుణ్యానికి ఫిదా
X
ఆ.ఆర్.ఆర్ లాంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతోంది ఆలియా భ‌ట్. రామ్ చ‌ర‌ణ్ - రామారావు క‌థానాయ‌కులుగా ఎస్.ఎస్.రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో ఈ సినిమా అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.

ఈ మూవీలో ఆలియా సీత‌గా న‌టిస్తోంది. రామ‌రాజు (చ‌ర‌ణ్) భార్య‌గా ఎమోష‌న్ ని ర‌గిలించే కీల‌క పాత్ర‌లో ఆలియా అభిన‌యించింది. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ అంత‌ర్జాలాన్ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ వీక్షించ‌గానే ఆలియా పాత్ర‌కు అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని అర్థ‌మైంది.

ఆలియా అటు హిందీ స‌హా తెలుగు-త‌మిళంలోనూ ప్ర‌చారంలో బిజీగా ఉంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో తెలుగు మీడియా ముందుకు ఆలియా ప్ర‌మోష‌న్ కి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆలియా భ‌ట్ ప‌లక‌రింపు తెలుగు భాష ఇక్క‌డి మీడియాని చిల్ చేసింద‌నే చెప్పాలి. ``అంద‌రికీ న‌మ‌స్కారం .. బాగున్నారా?`` అంటూ ఆలియా ప‌ల‌క‌రించ‌డ‌మే గాక‌.. మీరు ఎలా ఉన్నారు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా `బాగున్నాను` అంటూ తెలుగులోనే ఆలియా మాట్లాడారు. ఇలా తెలుగు ఆడియెన్ ముందుకు ఆర్.ఆర్.ఆర్ లాంటి క్రేజీ చిత్రంతో వ‌స్తున్నందుకు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఆర్.ఆర్.ఆర్ ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంద‌రినీ షేక్ చేస్తూ దూసుఎళ్లిపోయింది అంటూ ఆలియా సంబ‌ర‌ప‌డింది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని కూడా అంది. మొత్తానికి ఆలియా తెలుగు భాష ఉచ్ఛార‌ణ .. త‌న‌లోని డౌన్ టు ఎర్త్ నేచుర్ మ‌న‌వాళ్ల‌కు బాగానే క‌నెక్ట‌యిపోయాయి. ఇక పూర్తి మూవీలో ఆలియాభ‌ట్ న‌ట‌నాభినివేశం ఏ రేంజులో ఉండ‌నుందో వేచి చూడాలి. ఆలియా న‌టించిన హిందీ చిత్రాలు బ్ర‌హ్మాస్త్ర‌- గంగూభాయి క‌తియావాడీ త‌దిత‌ర చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.