Begin typing your search above and press return to search.

ఈ కితాబు ఒక మోస్త‌రు బిల్డ‌ప్ అంటూ కామెంట్లు

By:  Tupaki Desk   |   16 Nov 2021 8:53 AM GMT
ఈ కితాబు ఒక మోస్త‌రు బిల్డ‌ప్ అంటూ కామెంట్లు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` రెండు భాగాలుగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగం `పుష్ప ది రైజ్` గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా భారీ కాన్వాస్ పై పై తెర‌కెక్కుతోంది. ఎక్క‌డా రాజీలేని నిర్మాణంతో క్వాలిటీలో ది బెస్ట్ అందించ‌డానికి నిర్మాత‌లు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. స్క్రిప్ట్ డిమాండ్ మేర‌కు పేరున్న న‌టీనుటుల‌ను రంగంలోకి దించారు. మ‌ల‌యాళం న‌టుడు ఫ‌హిద్ ఫాజ‌ల్...జ‌గ‌ప‌తిబాబు..సునీల్ లాంటి వారు వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తున్నాయి.

సినిమా మొత్తం ప‌క్కా రా మెటీరియ‌ల్ గాను సుక్కు సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇలాంటి సినిమాలో హీటెక్కించే ఐటం సాంగ్ త‌ప్ప‌నిస‌రి క‌దా. అందుకే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ నే రంగంలోకి దించిన‌ట్లు తెలుస్తోంది. స‌మంత‌ను ఆ పాట‌లో స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ కి ఎంపిక చేసినట్లు స‌మాచారం. అందుకు స‌మంత‌కు భారీగానే పారితోషికం ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం స‌మంత‌ 1.5 కోట్లు ఛార్జ్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పారితోషికాన్ని మించి స‌మంత‌కు ఎక్కువ‌గానే కాంప్లిమెంంట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ ర‌కంగా స‌మంత కెరీర్ కి `పుష్ప` టీమ్ పెద్ద ఫేవ‌ర్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది.

స‌మంత‌ పేరును ప్ర‌క‌టిస్తూ..స‌మంత‌ని ఇండ‌స్ట్రీని ఏలుతోన్న హీరోయిన్ గా కితాబిచ్చారు. అయితే ఇది కాస్త అతిగానే అనిపిస్తుంద‌ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌మంత తీసుకున్న పారితోషికం కంటే ఈ కితాబు ఒక మోస్త‌రు బిల్డ‌ప్ గా ఉంద‌ని కామెంట్లు ప‌డుతున్నాయి. మ‌రి స‌మంత‌ని ఈ రేంజ్ లో నెత్తిన పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏంటో అంటూ ఒక సెక్ష‌న్ నెటిజ‌నులు అంటున్నారు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో సామ్ ఏదైనా ఫేవ‌ర్ చేసిందా.. అందుకే ఇంత‌గా ప్ర‌చారం చేస్తున్నారా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.