Begin typing your search above and press return to search.
సమంత ఐటమ్ సాంగ్.. పరోక్షంగా చైతూని ఉద్దేశించేనా..?
By: Tupaki Desk | 13 Dec 2021 6:01 AM GMTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల తన భర్త నాగచైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలు తన కెరీర్ మీద ఏమాత్రం ప్రభావం చూపించలేదని నిరూపిస్తోంది సామ్. బైలింగ్వల్ సినిమాలు - పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా ఒక ఇంటర్నేషనల్ మూవీ కూడా లైన్ లో పెట్టింది.
వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ దూకుడుగా వెళ్తోన్న సమంత.. విడాకుల ప్రకటన తర్వాత కూడా తన క్రేజ్ అలానే ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. అయితే ఉన్నట్టుండి సామ్ ఒక ఐటమ్ సాంగ్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ లో ఆమె ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా’ అనే ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. గేయ రచయిత చంద్రబోస్ ఈ గీతాన్ని మంగ్లీ సోదరి చంద్రావతి చౌహాన్ హస్కి వాయిస్ తో ఆలపించారు. ఇందులో సమంత రెచ్చిపోయి అందాలు ఆరబోసినట్లు ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో - లేటెస్టుగా వచ్చిన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.
సామ్ ఐటమ్ సాంగ్ చేయడం కెరీర్ లోనే ఇదే తొలిసారి. మాస్ ను ఆకట్టుకునేలా రెడీ చేసిన 'ఊ అంటావా..' పాట ఆమెకు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందనేది పక్కన పెడితే.. సమంత ఈ స్పెషల్ నంబర్ చేయడంపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. విడాకుల ప్రకటన చేసిన తర్వాత తనకు అడ్డు చెప్పేవారు లేరు కాబట్టి పొట్టి పొట్టి దుస్తుల్లో రచ్చ చేయడానికి సిద్ధమైందని ఓ వర్గం నెటిజన్స్ అంటున్నారు.
మరికొందరు మాత్రం సమంత ఈ ప్రత్యేక గీతంతో పరోక్షంగా నాగచైతన్య ను టార్గెట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. 'పెద్ద మనిషి లాగా ఒకడు ఫోజులు కొడతాడు.. మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు.. మంచి కాదు చెడ్డ కాదు.. అంతా ఒకటే జాతి.. మగ బుద్దే వంకర బుద్ధి' అంటూ సాగిన ఈ పాటలో లిరిక్స్ అలానే ఉన్నాయని అంటున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలికారు. కారణాలు ఎంటనేది వెల్లడించనప్పటికీ వీరి విడాకులపై ఇప్పటికీ అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చైతన్య సైలెంటుగా ఉంటున్నా సమంత మాత్రం విడాకులపై ప్రత్యక్షంగా పరోక్షంగా స్పందిస్తూనే ఉంది. ఇప్పుడు సమంత ప్రత్యేక గీతం కూడా నాగచైతన్య ను ఉద్దేశించిందిగానే నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.
సామ్-చైతూ విడాకుల వ్యవహారం దృష్టిలో పెట్టుకునే లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ పాటకు అలాంటి సాహిత్యం అందించి ఉంటారని కామెంట్ చేస్తున్నారు. అలానే ఆడవారు ఎలాగున్నా మగవారు వదిలిపెట్టడం లేదని.. మగవారి బుద్ధే వంకర బుద్ధి అని తెలుపుతూ లిరిక్స్ రాయడం పై ట్రోల్స్ వస్తున్నాయి. ఆడవారి మీద ఇలాంటి లిరిక్స్ రాయగలరా? అలా రాస్తే ఫెమినిస్టులు ఊరుకుంటారా? అని అంటున్నారు.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1 నేనొక్కడినే' పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సమంత.. ఇప్పుడు అదే దర్శకుడితో కలిసి మగవారిపై ఇలాంటి పాట చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 'ఊ అంటావా' ట్యూన్ ఫ్రెష్ ట్యూన్ కాదని.. ‘వీడోక్కడే’ సినిమాలో ‘హనీ హనీ’ అనే ఒక పాట బీట్ కి దగ్గరగా ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలా ఏదొక విధంగా సామ్ చేసిన 'పుష్ప' ఐటమ్ సాంగ్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.