Begin typing your search above and press return to search.

బిలియన్‌ పోస్టర్‌ లో 'రౌడీ బేబీ' ఎక్కడ?

By:  Tupaki Desk   |   20 Nov 2020 2:30 AM GMT
బిలియన్‌ పోస్టర్‌ లో రౌడీ బేబీ ఎక్కడ?
X
యూట్యూబ్‌ లో ఎప్పుడు చూసినా కూడా రౌడీ బేబీ పాట కనిపిస్తూనే ఉంటుంది. ధనుష్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా తమిళంలో రూపొందిన మారి 2 సినిమాలోని ఆ పాట జనాలకు పిచ్చెక్కించినంత పని చేసింది. ఆ పాటలో సాయి పల్లవి డాన్స్‌ కు ఫిదా అవ్వని వారు ఉండరేమో అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క చోట రౌడీ బేబీ పాటలకు డాన్స్‌ లు వేయడం కామన్‌ అయ్యింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా రౌడీ బేబీ సాంగ్‌ కు కాళ్లు కదిపిన వాళ్లే. అంతటి క్రేజ్‌ ను దక్కించుకున్న రౌడీ బేబీకి అనూహ్యంగా యూట్యూబ్‌ లో బిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

ఇప్పటి వరకు ఏ సౌత్‌ ఇండియన్‌ మూవీ పాటకు కూడా ఈ స్థాయిలో వ్యూస్‌ రాలేదు. బిలియన్‌ వ్యూస్‌ రావడం పట్ల యూనిట్‌ సభ్యులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఈ సమయంలో బిలియన్‌ పోస్టర్‌ ను అధికారికంగా విడుదల చేశారు. ధనుష్‌ ఫ్యాన్స్‌ పోస్టర్‌ ను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు అంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కాని అఫిషిల్‌ గా విడుదలైన ఈ పోస్టర్‌ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రౌడీ బేబీ హిట్‌ కు పూర్తి క్రెడిట్‌ ధనుష్‌ దే అన్నట్లుగా ఆయన ఫోజ్‌ తో బిలియన్‌ పోస్టర్‌ విడుదల అయ్యింది. కాస్త ఘాటుగా చెప్పాలంటే ధనుష్‌ ను బిలియన్‌ వ్యూస్‌ రాలేదు.. సాయి పల్లవి ఉండటం వల్ల బిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి అనేది చాలా మంది మాట. అలాంటి సాయి పల్లవి లేకుండా బిలియన్‌ పోస్టర్‌ ఏంటో అంటూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.