Begin typing your search above and press return to search.
తల్లి పాత్ర చేయడంలో తప్పేంటి?
By: Tupaki Desk | 21 Jan 2021 1:30 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ టాలీవుడ్ లో క్రాక్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. క్రాక్ సినిమాలో శృతి హాసన్ పదేళ్ల బాలుడికి తల్లిగా నటించడం చర్చనీయాంశం అయ్యింది. హీరోయిన్స్ ఎవరు కూడా ఇలా తల్లి పాత్రలకు కమిట్ అవ్వరు. కాని శృతి హాసన్ మాత్రం తల్లి పాత్ర కు ఓకే చెప్పడం ఏంటీ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. శృతి హాసన్ అభిమానులు కొందరు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాని శృతి హాసన్ మాత్రం తల్లి పాత్రలు చేస్తే తప్పేంటి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ఈ అమ్మడు ఒక మీడియా సంస్థతో ముచ్చటిస్తూ తల్లి పాత్ర ను చేయడం కొందరు తప్పుబడుతున్నారు. దానికి తప్పేంటో నాకేం అర్థం కావడం లేదు. హీరోయిన్ గా పాత్రకు ప్రాముఖ్యత ఉన్నప్పుడు తల్లి పాత్ర అయినా నేను చేసేందుకు సిద్దంగా ఉంటాను. నటిగా నన్ను నేను కొత్తగా చూపించేందుకు ఎప్పుడు కూడా సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ తో పాటు తల్లి పాత్రలు చేసేందుకు రెడీ అంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలకు కమిట్ అయ్యింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు ఏదైనా చేయాలనేది తన ఉద్దేశ్యంగా చెప్పుకొచ్చింది.