Begin typing your search above and press return to search.

పాపం రష్మిని హోలీ రోజు నెటిజన్స్‌ ఆడేసుకున్నారు

By:  Tupaki Desk   |   21 March 2019 10:18 AM GMT
పాపం రష్మిని హోలీ రోజు నెటిజన్స్‌ ఆడేసుకున్నారు
X
సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రష్మి పలు సార్లు వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఆమె చేసిన పోస్ట్‌ లు లేదంటే ఆమె ఇతర పోస్ట్‌ లకు రియాక్ట్‌ అయ్యే విధానం వల్ల వివాదం మొదలవుతూ ఉంటుంది. తాజాగా హోలీ సందర్బంగా కూడా వివాదం రేగింది. రష్మి ఒక సామాజిక బాధ్యతతో, మంచి ఉద్దేశ్యంతో హోలీ మనమే ఆడుకుందా, మూగ జీవాలైన కుక్కలు మరియు ఇతర జంతువులకు రంగులు పూయవద్దు అంటూ కోరుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కుక్కలకు రంగులు పూయడం వల్ల వాటికి స్కిన్‌ ఎలర్జి వస్తుందంటూ రష్మి ఒక రంగు పూసి ఉన్న కుక్క ఫొటోను పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ కాస్త వివాదాస్పదం అయ్యింది.

హిందువుల పండుగ అనగానే నీలాంటి వారికి జంతువులపై ప్రేమ గుర్తుకు వస్తుంది. ఇలాంటి కామెంట్‌ ను నువ్వు ముస్లీంల పండుగ అయిన బక్రీద్‌ లేదా మరే ఇతర ఈద్‌ రోజు చేయగలవా, వారి పండుగలకు పెద్ద ఎత్తున జంతు బలి జరుగుతుంది. అప్పుడు ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు అంటూ రష్మికి ఒక నెటిజన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఆ వ్యక్తికి సమాధానంగా ఏ సందర్బంలో అయినా నా ఎమోషన్‌ ఇలాగే ఉంటుంది. ఇక్కడ మతం గురించి మీరు తీసుకు రావాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.

రష్మీ స్పందనకు మరో నెటిజన్‌ కౌంటర్‌ ఇస్తూ... ముస్లీం ఫెస్టివల్‌ సమయంలో నీవు జంతువులపై ప్రేమను చూపుతు ఎందుకు ట్వీట్‌ చేయవు అంటూ ప్రశ్నిస్తే సమాధానం దాటవేసేలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మౌనంగా ఉండి, ఇప్పుడు మాట్లాడటం సేఫ్‌ ఫీలింగ్‌, సేమ్‌ ఎమోషన్‌ ఎలా అవుతుందని ప్రశ్నించాడు.

అందుకు రష్మీ సమాధానంగా... నేను హిందువును కనుక, నేను హిందూ ఫెస్టివల్స్‌ సందర్బంగా స్పందిస్తాను, ఇతర మతాల ఆచారాలు మరియు ఇతర వివరాలు నాకు తెలియదు. కాబట్టి నేను ఎలా వాటి గురించి మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది. నేను జంతువుల గురించి మాట్లాడితే నన్ను హిందూ వ్యతిరేకిని అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ముస్లీంల పండుగ రోజు జంతువుల గురించి మాట్లాడితే వారు నన్ను ముస్లీం వ్యతిరేకిగా ముద్రిస్తారని రష్మి అంది. మొత్తానికి ఇక్కడ జంతువుల గురించి మాట్లాడటమే తప్పా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.