Begin typing your search above and press return to search.
#బండ్ల ఫికరేంది? అప్పుడు గుర్తుకు రానిది ఇప్పుడే గుర్తొచ్చింది!
By: Tupaki Desk | 13 Sep 2021 12:30 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోరు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈసారి పోటీ ప్రకాష్ రాజ్..మంచు విష్ణు ప్యానల్ మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. అయితే నటుడు బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుని స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. దీంతో సీన్ మరింత వేడెక్కింది. ప్రకాష్ రాజ్ టార్గెట్ గా బండ్ల గణేష్ చేస్తోన్న ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి మందు పార్టీలు..విందు పార్టీలు మంచిదేనని ప్రకాష్ రాజ్ బాహాటంగానే ప్రకటించారు.
నరేష్ ఆ రకంగా ముందుకు కదలడంతో దాన్ని వ్యతిరేకించకుండా పూర్తి మద్దతు ప్రకటించారు విలక్షణ నటుడు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా డిన్నర్ పార్టీలు ఏర్పాటు చేసారు. సభ్యులు అందర్నీ ఆహ్వానిస్తూ ఓ ఇన్విటేషన్ కూడా ప్రింట్ చేయించి పంపించారు. దీంతో బ్లండ్ల గణేష్ దీనిపై ఆసక్తికర కామెంట్లు చేసారు. `ఓటు కావాలంటే అసోసియేషన్ కోసం పోటీదారులు ఏం చేస్తారో చెప్పి ఓటు వేయించుకోండి. వాళ్ల మనసులు గెలుచుకోండి. అంతేగానీ విందులు పార్టీలంటూ కొత్త పుంతలు తొక్కి మెంబర్లని తప్పు దారి పట్టించవద్దు. కరోనా వేళ `మా `మెంబర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దంటూ` తనదైన శైలిలో స్పందించారు బండ్ల.
నరేష్ కూడా ఇలాగే ఓ పార్టీ ఇచ్చారు. అప్పుడు బండ్ల గణష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్నారు. కానీ అప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్యానల్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే బండ్ల రివేంజ్ డ్రామా మొదలు పెట్టినట్లు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గుర్తు రాని సభ్యుల ఆరోగ్యం బండ్ల గణేష్ కి ఇప్పుడే గుర్తొచ్చిందా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. జీవితారాజశేర్ ఎంట్రీ కారణంగానే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ తప్పుకున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.
తనను కాదని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కి జీవితను ప్రవేశ పెట్టడంపై బండ్ల ఇప్పటికీ ప్రకాష్ రాజ్ పై మరిగిపోతున్నాడనడానికి ఇంతకంటే ప్రూఫ్ కావాలా. నిజానికి తనకు పదవి ముఖ్యం కాదు. పరువు మర్యాద ముఖ్యం. తాను దైవాలుగా భావించే మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లను కించపరుస్తూ జీవిత రాజశేఖర్ దునుమాడిన వీడియోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేసి మరీ రచ్చ చేసిన బండ్ల ఇప్పుడు వార్ డైరెక్ట్ గానే నడిపిస్తున్నాడు. తాను జీవితకు వ్యతిరేకంగా జనరల్ సెక్రటరీగా పోటీ చేయడానికి కారణం కూడా ఇదేనని చానెల్ లైవ్ లో బాహాటంగా ప్రకటించారు. మెగా వ్యతిరేకులను వదిలేందుకు అతడు అంగీకరించడం లేదు. ఆసక్తికరంగా ఓ టీవీ చానల్ లైవ్ లో మాత్రం ప్రకాష్ రాజ్ అధ్యక్షుడవ్వాలని బండ్ల అనడం .. ఆ తర్వాత బండ్ల స్వతంత్రుడిగా పోటీకి దిగడం తన ఇష్టమని ప్రకాష్ రాజ్ అనడం వగైరా డ్రామాలు రక్తి కట్టించాయి. కానీ ఇప్పుడు అందుకు కాంట్రాస్ట్ గా మ్యాటర్ నడుస్తోంది.
అక్టోబర్ 10న మా అఎన్నికలు..
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఇంకో నెలరోజుల సమయం ఉంది. ఈలోగా పోటీదారుల నడుమ ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి ఉంటుందో. అయితే ఈ పోటీలో తెలంగాణ కళాకారుల న్యాయం కోసం పోటీ చేస్తున్న సీవీఎల్ ఉన్నారా లేరా? అన్నది అర్థం కావడం లేదు. ఆయన ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండడంపైనా సెటైర్లు మొదలయ్యాయి. మూవీ ఆర్టిస్టుల సంఘాన్ని రెండుగా విభజించాలని పిలుపునిచ్చిన ఆయన సైలెంటయ్యారేమిటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.