Begin typing your search above and press return to search.

#ChaiSam : తప్పంతా సామ్ పై నెట్టేస్తున్నారు!

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:31 AM GMT
#ChaiSam : తప్పంతా సామ్ పై నెట్టేస్తున్నారు!
X
అక్కినేని ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీ మరియు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా షాక్ అయ్యేలా నాగ చైతన్య మరియు సమంతల విడాకుల ప్రకటన సంచలనం రేపింది. ఒక సెలబ్రెటీ కపుల్‌ విడాకుల విషయం ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కాని సమంత నాగ చైతన్యల విషయం మాత్రం అంతకు మించి అన్నట్లుగా జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది అయ్యో అనుకుంటూ ఉంటే కొద్ది మంది మాత్రం కలిసి ఉండలేకుంటే విడిపోవడం ఉత్తమం కదా అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ మాదిరిగా ఫిలాసఫీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి వారిద్దరి విడాకుల ప్రకటన వచ్చి రెండు రోజులు అయినా కూడా ఇంకా సోషల్‌ మీడియాలో ఆ విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. విడాకులు తీసుకున్న సమయంలో ఇద్దరు చాలా ఆలోచించి.. పెద్దలతో కూర్చుని మాట్లాడి సమస్య గురించి చాలా మాట్లాడుకున్న తర్వాతే ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని ఇద్దరు పూర్తి స్వేచ్చగా నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నట్లుగా వారు షేర్ చేసిన పోస్ట్‌ ను బట్టే అర్థం అవుతోంది. ఇద్దరు కూడా ఒకే పోస్ట్‌ ను షేర్‌ చేశారు అంటే ఖచ్చితంగా ఇద్దరి మద్య స్నేహపూర్వకంగానే ఈ వ్యవహారం జరిగిందని అనిపిస్తుంది. కాని కొందరు మాత్రం అతిగా ఊహించుకుంటూ విమర్శలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ విడాకుల విషయంలో ఎక్కువ శాతం సమంతను విమర్శించే వారు ఎక్కువ మంది ఉన్నారు. సహజంగానే భార్య భర్తలు విడిపోతే మన ఇండియన్ సమాజంలో అమ్మాయిలనే విమర్శించే వారు ఎక్కువ మంది ఉంటారు. అమ్మాయిలను మరియు అబ్బాయిలను సమాజంలో చాలా వ్యత్యాసంతో చూస్తారు అనే విషయం మరోసారి సమంత చైతూ విడాకుల విషయంలో నిరూపితం అయ్యింది. నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించిన సమయంలో ఆయన్ను వందలో ఒక్క శాతం మంది అయినా విమర్శించారో లేదో తెలియదు. ఆయన పద్దతి ఆయన వచ్చిన ఫ్యామిలీ ఆయన ఇన్నోసెంట్ తనం అన్ని కలగలిపి ఖచ్చితంగా చైతూ వల్ల ఈ విడాకులు తీసుకుని ఉండరని.. ఈ విషయంలో ఆయన తప్పు ఒక్క శాతం కూడా ఉంటుందని తాము భావించడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చాలా పద్దతైన ఇన్నోసెంట్‌ వ్యక్తి కనుక ఇలాంటి విషయాల్లో బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడు. చిన్న చిన్న ఇష్యూలు జరిగినా కూడా సమాజం కోసం కాస్త సైలెంట్ గా ఉండేలా జాగ్రత్త పడుతాడు అనేది చాలా మంది అభిప్రాయం.

ఈ వ్యవహారంలో మొత్తం తప్పు సమంతదే అన్నట్లుగా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమె పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విడాకులకు పూర్తి కారణం సమంత అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వీరి ప్రకటనకు రెండు మూడు రోజుల ముందు శ్రీరెడ్డి ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో లో సమంత ను సంసారం చక్కదిద్దుకో అంటూ సూచించింది. అలా ఎంతో మంది సమంతకు సలహా ఇచ్చారు. కాని ఆమె పట్టించుకోలేదు అంటూ నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమంత తాను ఒక స్టార్‌ అనే అనే ఈగోకు వెళ్లడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది అనే టాక్ వినిపిస్తుంది. నెట్టింట ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విడాకుల కారణం మొత్తం సమంతదే అన్నట్లుగా నెటిజన్స్ ఆమెపై బదనాం ఉంచేస్తున్నారు. పూర్తి బాధ్యత ఆమె తీసుకోవాల్సిందే అంటూ కొందరు బ్యాడ్‌ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి కొందరు మరింత అసభ్యకరంగా కూడా సమంతను విమర్శిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరు చాలా ఆలోచించిన తర్వాతే విడాకులు తీసుకున్నారు కనుక సమంతను ఒక్కదాన్ని బదనాం చేయడం పద్దతి కాదు.