Begin typing your search above and press return to search.
సుధీర్ బాబు బుజాలు ఎందుకు తడుముకుంటున్నాడు?
By: Tupaki Desk | 8 May 2022 9:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 12న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో నిర్వహించడం జరిగింది.
ప్రీ రిలీజ్ వేడుకలో పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మహేష్ బాబు యొక్క బాబాయి.. బావ మరియు మేనల్లుడు హాజరు అయ్యి మాట్లాడారు. సుధీర్ బాబు ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుధీర్ బాబు ముఖ్యంగా మహేష్ బాబు వింటేజ్ లుక్ గురించి వ్యాఖ్యలు చేశాడు. జనాలు మహేష్ బాబు వింటేజ్ లుక్ లో కనిపించడం చాలా బాగుందని అంటున్నారు.
ఆయనకు మాస్ క్లాస్ అనే తేడా లేదు. ఖచ్చితంగా వంద కోట్ల షేర్ నుండి ఈ సినిమా సందడి మొదలవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. పాన్ ఇండియా సినిమాలని అంటున్నారు. కాని మహేష్ సినిమా లను పాన్ ప్రేక్షకులు చూస్తున్నారు.. అంటే అన్ని వర్గాల వారు వయసుల వారు చూస్తున్నారంటూ సుధీర్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు తనయుడు దర్శన్ నటిస్తున్న విషయం తెల్సిందే. గతంలోనే ఈ విషయం రివీల్ అయ్యింది. మరోసారి సుధీర్ బాబు ఆ విషయాన్ని జనాలకు తెలియజేశాడు. ఈ సినిమాలో మా అబ్బాయి దర్శన్ నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. సినిమాలో దర్శన్ నటించేంత వరకు మహేష్ కు కాని నమ్రత కు కాని తెలియదని సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు.
మహేష్ సినిమాలో దర్శన్ అనగానే నెపొటిజం తొక్క అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తారు. కాని దర్శన్ ను చిన్నప్పటి మహేష్ బాబు పాత్ర కోసం సరిగ్గా సెట్ అవుతాడు అనే ఉద్దేశ్యంతోనే తీసుకున్నారు తప్ప మహేష్ బాబు రికమండేషన్ లేదు అన్నట్లుగా సుధీర్ బాబు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మహేష్ బాబు నవ్వేశాడు.
సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలను కొందరు కౌంటర్ చేస్తున్నారు. అసలు దర్శన్ ఈ సినిమాలో ఉండటం ను జనాలు పెద్దగా గుర్తించే అవకాశమే లేదు. అలాంటప్పుడు నెపోటిజం వరకు మాట్లాడుతారా అంటూ సుధీర్ బాబు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అయినా ఎవరు ఏం అనకుండానే నువ్వు ఎందుకు బుజాలు తడుముకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.