Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ అర్థ్ర రాత్రి ప‌ద‌నిస‌లు

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:30 PM GMT
శ‌ర్వానంద్ అర్థ్ర రాత్రి ప‌ద‌నిస‌లు
X
మ‌న స్టార్స్ అభిమానుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం కోసం ఎంత రిస్క్ అయినా చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. యాక్ష‌న్ స్టంట్స్ కి డూప్ లు వున్నా కానీ వారిని ప‌క్క‌న పెట్టేసి ప్ర‌మాద‌క‌ర స్టంట్స్ కి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌తీ సినిమా మొద‌టి సినిమా అన్న‌ట్టుగా శ్ర‌మిస్తున్నారు. ఇటీవ‌ల 12 గంట‌ల పాటు స్టార్ హీరో అల్లు అర్జున్ శ్ర‌మించ‌డం తెలిసిందే.

`పుష్ప‌` చిత్రంలోని హే బిడ్డా.. ఇది నా అడ్డా పాట‌లోని ఓ షాట్ కోసం ఏకంగా 24 డ్రెస్ లు మార్చి 12 గంట‌ల పాటు బ‌న్నీ శ్ర‌మించిన తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో యంగ్ హీరో శ‌ర్వానంద్ కూడా ఓ పాట కోసం శ్ర‌మించడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `మ‌హా స‌ముద్రం` త‌రువాత శ‌ర్వా రెండు చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం `ఒకే ఒక జీవితం`. కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ సినిమా ఓ సైన్స్ ఫిక్ష‌న్ అని, `ఆదిత్య 369` త‌ర‌హాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో రూపొందుతోంద‌ని స్ప‌ష్ట‌మైంది.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు శ‌ర్వా `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో న‌టిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ చిత్రం కోసం ఇటీవ‌ల చిత్ర‌పురి కాల‌నీలో ప్ర‌త్యేకంగా టైటిల్ సాంగ్ ని చిత్రీక‌రించారు. శేఖర్ మాస్ట‌ర్ నేతృత్వంలో చిత్రీక‌రించిన ఈ పాట‌కు దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించ‌డంతో పాటు త‌నే పాడారు.

ఈ పాట‌ని ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించి అర్థ్ర‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు చిత్రీక‌రించారు. కోవిడ్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ని ముగించాల‌ని టైటిల్ సాంగ్ ని అర్థ్ర రాత్రి వ‌ర‌కు చిత్రీక‌రించ‌డం, ఇందు కోసం ఓపిక‌గా హీరో శ‌ర్వానంద్ స‌హ‌క‌రించ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో రాధిక‌, ఖుష్బూ, ఊర్వ‌శి, వెన్నెల కిషోర్, బెన‌ర్జీ న‌టిస్తున్నారు.