Begin typing your search above and press return to search.
ఓమిక్రాన్ పై తప్పు దోవ పట్టిస్తారా? హరీష్ కౌంటర్ ఎటాక్!
By: Tupaki Desk | 9 Jan 2022 3:30 PM GMTమొదటి వేవ్ తో జనం ఒణికిపోయారు. లాక్ డౌన్ లతో గజగజలాడారు. ఇండియా అల్లకల్లోలం అయ్యింది. లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసాయి. సెకండ్ వేవ్ లో అది పదింతలైంది. భయానక వాతావరణం అల్లాడించింది. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు ఇండియాని తాకింది. రోజుకు లక్షన్నర కేసులతో సీన్ సీరియస్ గా మారితే.. దీనికి భయపడాల్సినదేమీ లేదని అంటూ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఒక డాక్టర్ వాంగ్మూలాన్ని ప్రజలకు వినిపించడం సంచలనంగా మారింది.
అయితే దీనిని ప్రజలు తప్పుబడుతున్నారు. సదరు డాక్టర్ తో కలిసి హరీష్ శంకర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు.ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్యంగా ఓమిక్రాన్ కేసుల విషయానికి వస్తే భయపడాల్సిందేమీ లేదనేస్తూ.. డాక్టర్ వివరిస్తున్న వీడియోను పంచుకున్నారు. వీడియోలో ప్రయివేట్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్ గురువా రెడ్డి వివరణ ఉంది. ఓమిక్రాన్ సాధారణ జలుబు తప్ప ఇంకేదీ కాదని టీకాలు వేయని వ్యక్తులు మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతారని వెల్లడించారు. మహమ్మారి ముగింపు దశకు చేరుకుంటుందని చెబుతూ అందరూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారు. దీనికి చాలా మంది నెటిజనులు కౌంటర్లు వేస్తున్నారు. ఆ ఇద్దరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎటాక్ చేయడం ప్రారంభించారు.
హరీష్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఓ యూజర్ ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన దర్శకుడు.. ఏదైనా మంచి జరుగుతుందని నిపుణుడు చెప్పినప్పుడు కూడా కొంతమంది ఎప్పుడూ ఆశలు పెట్టుకోరు అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. నిజానికి హరీష్ ఉద్దేశ్యం భయాందోళనల కంటే కొంచెం సానుకూలతను వ్యాప్తి చేయడమే.. కానీ కొద్ది మంది మాత్రమే దానిని గుర్తించారు. మెజారిటీ జనం తిట్టి పోస్తున్నారు.