Begin typing your search above and press return to search.
ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్న సుశాంత్ సింగ్ చివరి సినిమా...?
By: Tupaki Desk | 17 Jun 2020 1:30 AM GMTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ వార్త యావత్ భారతీయ సినీ ప్రేమికులను ఎంతగానో కలవర పెడుతోంది. గత మూడు రోజులుగా సుశాంత్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకి వస్తుండటంతో ప్రతీ ఒక్కరు మరింత విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ 2008లో 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' అనే సీరియల్ తో కెరీర్ ను స్టార్ట్ చేశారు. 'పవిత్ర రిస్తా' అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన సుశాంత్ 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక ధోనీ బయోపిక్ 'ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'పీకే' 'డిటెక్టీవ్ బ్యోమకేష్ భక్షీ' 'రాబ్టా' 'సొంచీరియా' 'కేదార్ నాథ్' 'చిచోరె' 'డ్రైవ్' సినిమాల్లో నటించి మెప్పించారు. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.
కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన “దిల్ బెచారా” చిత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల కాబోతోందని వార్తలు వస్తున్నాయి. నిజానికి 'దిల్ బెచారా' సమ్మర్ కానుకగా మే 8న రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ముఖేష్ ఛబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మించారు. ఈ సినిమా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' అనే నవల ఆధారంగా రూపొందింది. సుశాంత్ తో పాటు సంజన సాంఘి, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ సింగ్ క్యాన్సర్ పేషెంట్ గా కనిపిస్తాడట. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఓ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ చిత్రానికి కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా చిత్ర యూనిట్ కూడా అందుకు సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ఓటీటీలో రిలీజ్ చేయొద్దు.. థియేటర్స్ లో విడుదల చేయండి అంటూ #DilBecharaOnBigScreen హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. సుశాంత్ గత చిత్రం 'డ్రైవ్' కూడా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఓటీటీ యాప్ లో అందుబాటులోకి వస్తుందా లేదా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.