Begin typing your search above and press return to search.
మెగాస్టార్ అక్కడ వెనక్కి తగ్గాడా...?
By: Tupaki Desk | 9 July 2020 12:59 PM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి చిరంజీవి ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో ఖాతాలు ఓపెన్ చేశారు. కొద్దిగా లేట్ గా ఎంట్రీ ఇచ్చినా.. డైలీ ఏదొక ట్వీట్ చేస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ప్రత్యేకతను చూపిస్తూ వచ్చాడు.
ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు సీసీసీ కి సంభందించిన వివరాలు వెల్లడించడం.. విపత్కర పరిస్థితుల్లో తన సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించడం.. ప్రముఖుల బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పడం.. ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే విషయాలు వెల్లడిస్తూ వస్తున్నారు.
అంతేకాకుండా సినిమా షూటింగ్స్ కి అనుమతించిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెప్పడం.. కరోనా సమయంలో ప్రజా సేవకై పాటు పడిన వ్యక్తులను అభినందించడం.. రక్తదానాలు చేయడం.. ఇలా అన్ని విషయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించడం లేదు. చివరగా జూన్ 21న ఫాదర్స్ డే నాడు ట్వీట్ చేసిన చిరు ఇప్పటి వరకు మరో పోస్ట్ పెట్టలేదు. దీంతో నెటిజన్స్ చిరంజీవి సోషల్ మీడియాలో సైలెంటుగా ఉండటానికి కారణమేంటని డిస్కస్ చేస్తున్నారు.
నిజానికి టాప్ స్టార్స్ లలో చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. కొందరు వారానికి ఒకటి నెలకు ఒకటి అన్నట్లుగా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మెగాస్టార్ సోషల్ మీడియా ట్రోల్స్ ఎలా తట్టుకొని నిలబడతాడనే అనుమానం అందరి మదిలో మెదిలింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి వరుసగా పోస్ట్ లు పెట్టడం స్టార్ట్ చేశారు. తన అనుభవంతో అవగాహనతో ట్రోల్స్ ఏమి పట్టించుకోకుండా తనదైన శైలిలో ట్వీట్స్ చేసుకుంటూ వచ్చారు.
అయితే ఇప్పుడు సడన్ గా సైలెంట్ అవడంతో మెగా అభిమానులందరూ ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తున్నారు. అందులోనూ ఇటీవల ప్రముఖుల పుట్టినరోజులు.. ముఖ్యమైన డేస్ వచ్చాయి. అయినా కూడా చిరు స్పందించలేదు. అందరూ స్టార్స్ లాగే మెగాస్టార్ కూడా ఆచితూచి ట్వీట్ చేయాలని డిసైడ్ అయ్యాడేమో అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.