Begin typing your search above and press return to search.
ఆ దర్శకుడికి ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లు ఉందా...?
By: Tupaki Desk | 16 April 2020 9:50 AM GMTకేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో మూడు వారాలు పొడిగించిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులు సెలబ్రెటీలు ఇంటికే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలీడేస్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఖాళీగా ఉండటంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తున్నారు. కొంతమంది దర్శకులు మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని కొత్త కథలు రాసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. వారిలో తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సరిలేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కూడా అదే పనిలో ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడి లాక్ డౌన్ నేపథ్యంలో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుండటంతో ఇంటికే పరితమయ్యాడు. అయితే ఈ మధ్య ఒక వెబ్ మీడియాకి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఇంటి జైల్లోనే ఉన్నానని చెప్పాడట. అయితే ఇదే ఇప్పుడు ఆయన పై నెటిజన్లు ఫైర్ అవడానికి కారణమైంది.
అనిల్ రావిపూడి ఒంగోలుకు సమీపంలోని స్వగ్రామంలో తన రెండస్తుల ఇంట్లో బందీ అయ్యానని.. లాక్ డౌన్ ప్రకటించక ముందే తన ఇంటికి చేరుకున్నానని.. తనతో పాటు తన టీమ్ మొతాన్ని తీసుకెళ్లి 'ఎఫ్3' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని సదరు చానల్ కి ఫోన్ ద్వారా ఈ వివరాలను తెలియజేసాడట. ఇంటిలో ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చని సినిమా వాళ్లంతా ప్రచారం చేస్తూంటే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం తన సొంత ఇంటిని జైలుగా అభివర్ణించడం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారట. అనిల్ రావుపూడి ఇలా అనడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారట. ఇలా సెలబ్రెటీ స్టేటస్ ఉండే వారు హౌస్ క్వారంటైన్ పై పాజిటివ్ గా స్పందిస్తూ సామాన్య ప్రజానీకాన్ని ఇళ్ల నుండి బయటకు రాకుండా ప్రోత్సహించాలే తప్ప.. ఇల్లే నాకు జైలు.. జైల్లో నే 'ఎఫ్ 3' కథ రాస్తున్నా.. అంటూ నెగిటివ్ సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు సబబని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనికి తోడు అనిల్ రావిపూడి సినిమాల పై ఒక వర్గం ఎప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటుంది. వంద కోట్లు కలెక్ట్ చేసిన ఎఫ్2 సినిమా సెకండ్ హాఫ్ డ్రాగ్ అయిందని, క్లైమాక్స్ కూడా బాగాలేదని ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా సరిలేరు నీకెవ్వరూ స్క్రిప్ట్ మీద అనిల్ ఇంకొంచెం కాన్సంట్రేషన్ పెట్టి ఉంటే బొమ్మ వేరే లెవెల్లో ఉండేదని కూడా ఈయన మీద కామెంట్స్ చేసేవారు కూడా లేకపోలేదు. అందుకని ఈసారి స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా చూసుకోవాలని.. ఎఫ్3 హిట్ కొట్టకపోతే నెక్స్ట్ అవకాశాలు సన్నగిల్లే అవకాశం ఉందని వారు సలహా ఇస్తున్నారు. 'ఎఫ్3' ప్లాప్ అయితే మహేష్ కూడా పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 'ఎఫ్3' మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ మేనరిజమ్స్.. వెంకీ హాసన్.. అంతేగా అంతేగా లాంటివి కంటిన్యూ అవుతాయని.. ఎఫ్2 కి మించి ఎఫ్3 ఉండబోతోందని కూడా అనిల్ రావిపూడి చెప్పాడట. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడు ఈ దర్శకుడు.