Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్.. రీజన్ ఇదే!

By:  Tupaki Desk   |   9 Jan 2021 1:30 AM GMT
ప్రియాంక చోప్రాపై నెటిజన్ల ఫైర్.. రీజన్ ఇదే!
X
స్టార్‌ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనస్‌ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిందని మండిపడుతున్నారు. ఇంతకీ.. ప్రియాంక చేసిన తప్పు ఏమంటే.. కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే!

ప్రస్తుతం లండన్ లో కొవిడ్ స్ట్రెయిన్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ కఠిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది ప్రభుత్వం. అయితే.. షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం లండన్‌లో ఉన్న ప్రియాంక, గతవారం తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రిటీ స్టైలిస్ట్‌ జోష్‌ వుడ్‌కు సంబంధించిన సెలూన్‌ కు వెళ్లింది.

ఇది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమచారం అందించాడు. పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకతో పాటు మిగతా వారిని హెచ్చరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా సెలూన్‌ను తరిచిన జోష్‌ వుడ్‌ను గట్టిగా మందలించారు. అయితే.. షూటింగ్‌లో భాగంగా తన హేర్‌కు కలర్‌ వేసుకోవాల్సి ఉందని, అందుకే సెలూక్‌కు వచ్చినట్లు ప్రియాంక పోలీసులకు తెలిపింది.

ఈ విషయం వైరల్‌ అవ్వడంతో నెటిజన్‌లు ప్రియాంక తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తీవ్రత దారుణంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తన హేర్‌కు కలర్‌ వేసుకోవడం ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇది సో కాల్డ్‌ సెలబ్రిటీలను అనుసరించడం ఆపే సమయం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ టీవీ, సినిమా షూటింగ్‌లకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ప్రస్తుతం 'టెక్ట్‌ ఫర్‌ యూ' మూవీ షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం చిత్ర యూనిట్‌ ఇటీవల అక్కడకు చేరుకుంది. లండన్‌ మార్గదర్శకాలను అనుసరించి ఈ టీం మొత్తం కోవిడ్‌ టెస్టులు చేయించుకుని క్వారంటైన్‌కు కూడా వెళ్లింది. ఇటీవలే క్వారంటైన్‌ సమయం ముగియడంతో ప్రియాంక హేర్‌ కలర్‌ కోసం బయటకు వచ్చింది. అటు పోలీసులతోపాటు ఇటు నెజిన్లకు చిక్కింది.