Begin typing your search above and press return to search.

సామ్ కు కుర్కురే కిరికిరి!

By:  Tupaki Desk   |   12 March 2019 7:32 AM GMT
సామ్ కు కుర్కురే కిరికిరి!
X
ఏవైనా బహుళజాతి ఉత్పత్తులను సెలెబ్రిటీలు ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు గుడ్డిగా కాకుండా వాటి వాడకంలో వచ్చే పర్యవసనాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. గతంలో మ్యాగీ నూడిల్స్ డైరీ మిల్క్ చాకోలెట్స్ కోకోకోలా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ విషయంలో నానా రచ్చ జరిగి సినిమా తారల విశ్వసనీయతకే ముప్పొచ్చి పడింది.

సాధారణంగా ఇవి వాడమని చెప్పే మన స్టార్లు ఎవరూ సదరు వస్తువులను నిజ జీవితంలో కనీసం తాకుతారో లేదో కూడా అనుమానమే.తాజాగా సమంతా ఇలాంటి విషయంగానే అభిమానుల సోషల్ మీడియా కామెంట్స్ లో నలిగిపోతోంది. ప్రముఖ స్నాక్స్ బ్రాండ్ కుర్కురే ఉత్పత్తులు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతా ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ ప్రోత్సాహకరంగా మాట్లాడింది. తాను దానికి అంబాసిడర్ గా కాబట్టి అందులో తప్పేమి కాదు.

అయితే అభిమానులతో పాటు నెటిజెన్లు ఇదే విషయం మీద సామ్ మీద ఫైర్ అవుతున్నారు. తామెంతో ఇష్టపడే బాధ్యతాయుతమైన హీరోయిన్ అయ్యుండి పిల్లలకు ప్రమాదకరం అని ప్రచారంలో ఉన్న కుర్కురేని వాడమని చెబుతారా అంటూ ఓ రేంజ్ లో విరుచుకు పడ్డారు.

గతంలో కుర్కురేని కాలిస్తే ప్లాస్టిక్ బయటికి వస్తుందన్న తరహాలో కొన్ని వీడియోలు ఆన్ లైన్ లో హల్చల్ చేశాయి. వాటికి క్లారిటీ ఇస్తూ సదరు సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మంచు లక్ష్మి ఇప్పుడు సమంతా కుర్కురే ప్రోడక్ట్స్ ని తినమంటూ మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనే నిర్ధారణ మనం చేయలేము కానీ ఇలాంటివి ఒప్పుకునే ముందు తారలే ఆలోచించాలి. ఆదాయం వస్తున్నప్పుడు ఆలోచన పని చేయడం కష్టమే