Begin typing your search above and press return to search.
'ఇదే.. ఈ ఓవరాక్షన్ కాస్త తగ్గించుకుంటే మంచిది..' నటిపై నెటిజన్లు ఫైర్
By: Tupaki Desk | 14 May 2021 2:30 AM GMTకొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడానికి తారలు టీకా వేసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. చైతన్యవంతులను చేయడానికి తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది కొందరి విషయంలో బెడిసి కొడుతోంది. నెటిజన్లు తారలను ఎంత ఎత్తుకు ఎత్తుతారో.. తేడా వస్తే అంతకు మించి ట్రోల్ చేస్తారు. తాజాగా నటి ఆర్తి సింగ్ విషయంలో ఇదే జరిగింది.
తాజాగా ఈ అమ్మడు కరోనా వైరస్ టీకా తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కొన్ని రకాల హావభావాలు ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అంతేకాకుండా ' ఇంజక్షన్ అంటే చాలా భయం.. అయినా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకున్న. మహమ్మారిపై అందరూ కలిసిపోరాడుదాం' అంటూ తన అభిప్రాయాన్ని రాశారు. కానీ ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
కోపంతో ఊగిపోయిన కొందరు నెటిజన్లు ఈ అమ్మడిపై ట్రోల్ మొదలు పెట్టారు. 'చేతిపై అంత పెద్ద పచ్చబొట్టు వేసుకున్నప్పుడు సూది అంటే భయం కలగలేదా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లేని భయం వ్యాక్సిన్ అప్పుడే ఎందుకు అంటూ ఆగ్రహించారు.' ఈ ప్రశ్నలను చాలామంది సమర్థించారు. 'ఇదే కాస్త ఎక్కువైంది. ఈ ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది' అని కామెంట్ చేస్తున్నారు.