Begin typing your search above and press return to search.
హిందూ లీడర్ పాత్రలో ముస్లిం హీరోనా?
By: Tupaki Desk | 24 Dec 2017 6:03 AM GMTఅనుకున్నదే అయింది. బాల్ థాకరే జీవిత కథతో అనౌన్స్ చేసిన ‘థాకరే’ సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే వివాదాలకు కేంద్ర బిందువు అయింది. మూడు రోజుల కిందటే ‘థాకరే’ టీజర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. త్వరలోనే మొదలుపెట్టి.. 2019 జనవరి 23కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు.
ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖి బాల్ థాకరే పాత్ర పోషించబోతున్నాడు. ఇక్కడే వచ్చింది సమస్య. హిందువుల హక్కుల కోసం పోరాడిన థాకరే పాత్రకు ఓ ముస్లిం నటుడిని తీసుకోవడమేంటంటూ థాకరే అభిమానులు పెదవి విరుస్తున్నారు. అదే సమయంలో ముస్లిం వర్గాలు కూడా ఈ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల మీద ఎప్పుడూ విషం కక్కిన.. వాళ్లపై తన సేనల్ని ఉసిగొల్పిన థాకరే పాత్రను ఓ ముస్లిం ఎందుకు చేస్తున్నాడంటూ వాళ్లు గొడవ చేయడం మొదలుపెట్టారు.
అదే సమయంలో ఇంకో వాదన కూడా తెర మీదికి వచ్చింది. థాకరే ముంబయిలో మరాఠీల హక్కుల కోసం పోరాడాడని.. స్థానికులకే అవకాశాలు దక్కాలన్నాడని.. వేరే రాష్ట్రాల వాళ్లకు వ్యతిరేకంగా పని చేశాడని.. అలాంటపుడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నవాజుద్దీన్‌ను ఎందుకు ప్రధాన పాత్ర ఎంచుకున్నాడని మరాఠీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరాఠీ సినిమాలో ఎందరో గొప్ప నటులున్నారని.. వాళ్లందరినీ కాదని నవాజుద్దీన్ ను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఐతే వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికే నవాజుద్దీన్ ను ఎంచుకున్నట్లుగా చిత్ర బృందం చెబుతోంది. ఇంకా సినిమా మొదలవకముందే ఇన్ని గొడవలంటే.. ఇక సినిమా విడుదలకు ముందు ఇది ఇంకెన్ని వివాదాలు రాజేస్తుందో చూడాలి.