Begin typing your search above and press return to search.

కనీస సామాజిక బాధ్యత లేదా అంటూ అనసూయపై ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   23 March 2020 5:52 AM GMT
కనీస సామాజిక బాధ్యత లేదా అంటూ అనసూయపై ట్రోల్స్‌
X
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తన హాట్‌ ఫొటో షూట్స్‌ ను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ తో పంచుకోవడంతో పాటు తనకు తోచిన సామాజిక విషయాల గురించి కూడా స్పందిస్తూ ఉంటుంది. తనపై ఎవరైనా కామెంట్స్‌ చేసినా కూడా తీవ్రంగా స్పందించేందుకు ఏమాత్రం వెనకాడదు. అయితే ఈసారి అనుష్క చేసిన ఒక ట్వీట్‌ విమర్శల పాలయ్యింది. కరోనా ఉజృంభిస్తున్న ఈ సమయంలో ఈమె చేసిన ట్వీట్‌ బాధ్యతారాహిత్యంగా ఉందంటూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోజు రోజుకు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ లాక్‌ ఔట్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్‌ చేయాల్సిందే అంటూ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ లో స్పందిస్తూ సీఎం కేసీఆర్‌ గారు చెప్పింది పాటించాలని చెబుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటీ అనే విషయమై ఆయన ట్వీట్‌ చేశాడు. కేటీఆర్‌ ట్వీట్‌ కు అనసూయ రిప్లైగా ఒక ట్వీట్‌ చేసింది.

ఆ ట్వీట్‌ లో ప్రభుత్వం చెప్పింది పాటించాల్సి. కాని కొన్ని ప్రొఫెషన్స్‌ విషయంలో ఈ నిబంధన సడలించాలంటూ విజ్ఞప్తి చేసింది. మేము పని చేస్తేనే డబ్బులు వస్తాయి.. ఇంటి రెంటు కట్టాల్సి ఉంటుంది కరెంటు బిల్లులు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అలాంటి వాటికి మేము తప్పనిసరిగా వర్క్‌ చేయాలని అందుకే మాలాంటి వారికి నిబంధనలు సడలించాలంటూ కేటీఆర్‌ కు అనసూయ విజ్ఞప్తి చేసింది.

అనసూయ ట్వీట్‌ పై పలువురు పలు రకాలుగా స్పందించారు. కరోనా కారణంగా చావు భయంతో అంతా ఒణికి పోతుంటే నీవు కరెంటు బిల్లు కట్టుకోవాలి.. ఈఎంఐ కట్టాలంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నీకు కనీసం సామాజిక బాధ్యత ఉన్నట్లుగా లేదు. అందుకే ఈ చిన్న చిన్న విషయాలకు అత్యంత ప్రముఖమైన కార్యం అయిన లాక్‌ ఔట్‌ ను నీరుగార్చేలా మాట్లాడుతున్నావు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత సంపాదించే నీకు ఒక్క నెల ఖాళీగా ఉంటే గడవక పోవడం ఏంటీ విడ్డూరం కాకుంటే అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.